తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections 2023) పూర్తయిన తర్వాత టీఎస్పీఎస్సీని (TSPSC) పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రకటించారు. డిసెంబర్ 4న ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న యువతతో అశోక్ నగర్ వెళ్లి సమావేశం అవుతానని ప్రకటించారు. టీఎస్పీఎస్సీలో శాశ్వత ఉద్యోగులను నియమిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు, యూనివర్సిటీ విద్యార్థులతో ఈ రోజు మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను, భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను మంత్రి వారికి వివరించారు. ఇందుకు సంబంధించిన లెక్కలను వారికి అందించారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. నిరుద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పోస్టుల సంఖ్యను కూడా పెంచుతామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ను ను విడుదల చేస్తామన్నారు.
పూర్తిగా చదవండి..KTR: నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..
టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ రోజు నిరుద్యోగులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే అశోక్ నగర్ కు వెళ్లి నిరుద్యోగులతో సమావేశం అవుతానన్నారు.

Translate this News: