ఏపీలో బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికిప్పుడు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చాక.. కేంద్ర బడ్జెట్ చూశాకే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆర్థికశాఖపై సమీక్షలో కూడా దీనిపై చర్చ జరిపారు. మరో రెండు నెలల పాటు ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సెప్టెంబర్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read: గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా?: క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అప్పులపై అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం రూ.14 లక్షల కోట్లు ఉంటాయని ఆర్థికశాఖ అంచనా వేసింది. పెండింగ్ బిల్లులపై చంద్రబాబు ఆరాతీశారు. ఆర్థిక శ్వేతపత్రంపై కూడా అధికారులు లెక్కలు సిద్ధం చేశారు.
Also Read: అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు