Hema: దూరదర్శన్ లో ప్రేమ.. కెమెరామెన్ తో పెళ్లి.. హేమ ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరీ! బెంగళూర్ రేవ్ పార్టీ ఇష్యూతో వార్తల్లో నిలిచిన నటి హేమ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హేమ అసలుపేరేంటి? సినిమాల్లోకి ఎలా వచ్చింది? రామ్ గోపాల్ వర్మనే ఆమెకు లైఫ్ ఇచ్చాడా? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, పెళ్లి గురించి తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 27 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Actress Hema Life Story: బెంగళూర్ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి హేమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెది ప్రేమ వివాహమని, సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే పెళ్లాడిదంటూ చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆమెను పెళ్లాడిన అతగాడేవరని జనాలు తెగ వెతికేస్తున్నారు. అంతేకాదు హేమకు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉందని చాలా మందికి తెలియదు. ఇంతకు హేమ అసలుపేరేంటి? సినిమాల్లోకి ఎలా వచ్చింది? ఏ సినిమాతో పాపులారిటీ దక్కించుకుందనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ సినిమాతో గుర్తింపు.. ఈ మేరకు హేమ అసలు పేరు కృష్ణవేణి. తూర్పుగోదావరి జిల్లా రాజోలుకి చెందిన ఆమె.. 1989 తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన 'భలేదొంగ' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కానీ ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ శ్రీదేవీ, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా 'క్షణక్షణం'తో ఆమె జీవితమే మారిపోయింది. ఈ సినిమాలో శ్రీదేవికి స్నేహితురాలిగా కనిపించిన హేమ.. తన నటనతో అందరినీ ఆకట్టుకుని మంచి గుర్తింపు సంపాదించుకుంది. అక్కడినుంచి వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందలకు పైగా సినిమాల్లో నటించి విభిన్నమైన పాత్రలతో అభిమానులను అలరిస్తోంది. Also Read: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఊర్వశి ధరించిన దుస్తుల ఖరీదు అన్ని కోట్లా? దూరదర్శన్ లో చిగురించిన ప్రేమ.. సినిమాల్లోకి రాకముందు దూరదర్శన్‌లో పనిచేసింది హేమ (Actress Hema). అదే సమయంలో అక్కడే అసిస్టెంట్ కెమెరా మెన్‌గా పనిచేసే సయ్యద్ జాన్ అహ్మద్ (Syed Jaan Ahmed) తో పరిచయం ఏర్పడింది. అయితే ఓసారి సయ్యద్ తనను మొదటిసారి కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని తెలిపింది. మొదటిసారి కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కాదనలేకపోయానంటూ తన లవ్ స్టోరీ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇక వీరిద్దరికీ ఈషా అనే కూతురు కూడా ఉంది. #personal-life #hema #tollywood మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి