Air India-Vistara: ఎయిర్ ఇండియా, విస్తారా కలిసిపాయో...!! ఎయిరిండియా, విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిరిండియా విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ శుక్రవారం ఆమోదం తెలిపింది. తన విమానాయన వ్యాపారాన్ని విస్తరించే దిశగా టాటా గ్రూపునకు ఇది పెద్ద అడుగుగా చెప్పవచ్చు. By Bhoomi 02 Sep 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Air India-Vistara :ఎయిరిండియా, విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిరిండియా విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ (CCI) శుక్రవారం ఆమోదం తెలిపింది. తన విమానాయన వ్యాపారాన్ని విస్తరించే దిశగా టాటా గ్రూపునకు ఇది పెద్ద అడుగుగా చెప్పవచ్చు. విలీనానికి అమోదం తెలిపినట్లు సీసీఐ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ ప్లాట్ ఫాం ట్విట్టర్ పోస్టు ద్వారా తెలిపింది. "ఎయిరిండియాతో టాటా SIA ఎయిర్‌లైన్స్ విలీనానికి, పార్టీలు ప్రతిపాదించిన స్వచ్ఛంద కట్టుబాట్లకు లోబడి సింగపూర్ ఎయిర్‌లైన్స్ ద్వారా ఎయిర్ ఇండియాలో కొన్ని వాటాలను కొనుగోలు చేయడానికి CCI ఆమోదించిందని తెలిపింది. The proposed combination envisages (a) the merger of Tata SIA Airlines Limited (TSAL/Vistara) into Air India Limited (AIL/Air India), with AIL being the surviving entity (Merged Entity) and (b) in consideration of the merger, the acquisition of shares in the Merged Entity by…— ANI (@ANI) September 1, 2023 విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూపునకు చెందిన పూర్తి-సేవ విమానయాన సంస్థలు. విస్తారా(Vistara)లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ 49 శాతం వాటాను కలిగి ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను కొనుగోలు చేసే ఒప్పందం ప్రకారం గత ఏడాది నవంబర్‌లో ఎయిర్ ఇండియాతో తన విస్తరణ విలీనాన్ని టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతిపాదిత విలీనానికి CCI అనుమతి కోరింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TSPL), ఎయిర్ ఇండియా లిమిటెడ్, టాటా SIA ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ (TSAL) సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ పార్టీలుగా మారాయి. ఈ ఒప్పందం తర్వాత, ఎయిర్ ఇండియా దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థ, రెండవ అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ అవుతుంది. ఇది కూడా చదవండి: వాళ్లవల్లే కాలేదు…మీ వల్ల ఏమౌతుంది..మోదీకి రాహుల్ కౌంటర్ ..!! జనవరి 2022లో ప్రభుత్వం నుంచి నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా (AIR India)ను టాటా గ్రూప్ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ యొక్క పునరుజ్జీవనం కోసం అనేక ప్రణాళికలు రూపొందించాడు. ఈ క్రమంలో, ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్, బోయింగ్‌లకు 470 విమానాల సరఫరా కోసం $ 70 మిలియన్ల ఆర్డర్ కూడా చేసింది. దీనితో పాటు, కంపెనీ ఎయిర్ ఇండియా యొక్క కొత్త లోగో బ్రాండ్ గుర్తింపును విడుదల చేసింది. ఎయిర్ ఇండియా గతంలో ఉపయోగించిన ఇండియన్ విండోలో బంగారు విండో ఫ్రేమ్‌లో కొత్త రూపాన్ని రూపొందించినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇది కూడా చదవండి: సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి తర్మన్ షణ్ముగరత్నం..!! #air-india #vistara #air-india-flight #vistara-airlines #air-india-vistara #merging-of-air-india-vistara #cci-approves-vistara-air-india-merge మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి