Parliament Attackers : ఇంజనీర్, లెక్చరర్, రిక్షా డ్రైవర్...పార్లమెంటు దాడి చేసింది వీళ్ళే

New Update
Parliament Attackers : ఇంజనీర్, లెక్చరర్, రిక్షా డ్రైవర్...పార్లమెంటు దాడి చేసింది వీళ్ళే

Smoke Attack : పార్లమెంటు(Parliament) లోకి వచ్చి స్మోక్ దాడి చేసిన నిందితులు పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. సాగర్ శర్మ, నీలం కౌర్, మనోరంజన్, అమోల్ షిండే, విక్కీ శర్మ, లలిత్ ఝాలు భ‌గ‌త్ సింగ్ ఫ్యాన్ క్ల‌బ్‌కు చెందిన‌ వారు. అయితే వీరి ప్రాంతాలు వేరు అయినా ఒకే ఆలోచన, భావజాలం కలిగి ఉన్న కారణంగా వీరంతా కలిసారు. సోషల్ మీడియాలో వీరికి పరిచయం ఏర్పడింది.

వీరిలో నీలం కౌర్ , అమోల్ షిండే లు ఉద్యోగం రాక కష్టపడుతున్నారు. ఒకసారి తమకు కావాల్సిన జాబ్ కోసం ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. నీల‌ం కౌర్ హ‌ర్యానాలోని హిస్సార్‌కు చెందినామె. ఎంఫిల్ చేశారు. నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్టు కూడా పాసైన నీలం కౌర్.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కలర్ స్మోక్ క్యాన్ల‌తో నిర‌స‌న చేసింది. 37 ఏళ్ళ నీలం కౌర్ గతంలో సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేసిన ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. రెజ్ల‌ర్ల నిర‌స‌న స‌మ‌యంలోనూ పాల్గొన్నారు. ఉన్న‌త విద్య‌ను అభ్యసించినా ఆమెకు ఉద్యోగం ద‌క్క‌లేదు. మరోవైపు మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన అమోల్ షిండే ఎస్సీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. 25 ఏళ్ళ అమోల్ షిండే.. పోలీసు, ఆర్మీ ప‌రీక్ష‌ల్లో విఫ‌లం అయ్యాడు.

Also Read:పార్లమెంటు దాడి ప్రధాన సూత్రధారుడు లలిత్ ఝా ఎవరు? అతనికి బెంగాల్ లో ఎన్జీవోకి ఉన్న సంబంధం ఏంటి?

ఇక స్మోక్ క్యాన్‌తో దూకిన వ్య‌క్తి పేరు సాగర్ శర్మ. ఇతనికి 27 ఏళ్ళు. ఢిల్లీలో పుట్టిన సాగర్ శర్మ.. ల‌క్నోలో పెరిగాడు. సోష‌ల్ మీడియాలో ఇతను ఎక్కువగా భ‌గ‌త్ సింగ్‌, చే గువేరా పోస్టులు చేస్తుండేవాడు. ఇతను ఈ- రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళుతున్నాని చెప్పి పార్లమెంటులో దాడికి వచ్చాడు సాగర్. మరో నిందితుడు మనోరంజన్ మైసూర్ కు చెందినవాడు. ఇతను ఇంజీరింగ్ పూర్తి చేశాడు. 34 ఏళ్ళ మనోరంజనే పార్లమెంటులో ఎంట్రీకి పాస్ తీసుకున్నాడు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా పేరు మీద విజిటర్స్ గ్యాలరీ పాస్ తీసుకున్నాడు. మనో రంజన్ ఇంతకు ముందు నరేంద్రమోదీకి ఫ్యాన్. అయితే మోదీ పదవిలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాల పట్ల విసుగుచెందినట్లు చెబుతున్నాడు. ఈతని తండ్రి దేవరాజ్ గౌడనే తన కొడుకు ఉరి తీయాలని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు