ఎనిమిదేళ్ల బాలికపై పగ తీర్చుకున్న సైకో.. బెల్ట్‌తో కట్టేసి గొంతు.. ఓ ఎనిమిదేళ్ల బాలిక అందరిముందు తనను అవహేళన చేసిందనే కోపంలో ఓ యువకుడు గొంతుకోసి చంపిన దారుణమైన సంఘటన మహరాష్ట్రలో జరిగింది. మృతదేహాన్ని బెల్డ్ తో కట్టేసి ఇంట్లో దాచిపెట్టగా వాసన పసిగట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. By srinivas 10 Dec 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Psycho : అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికను ఓ యువకుడు దారుణంగా హతమార్చిన సంఘటన మహారాష్ట్రలో సంచలనం రేపింది. గతంలో ఒకసారి అందరిముందు తనను అవహేళన చేసిందనే కారణంతో కొంతకాలంగా పగతో రగిలిపోతున్న సైకో(Psycho) చివరికి అమ్మాయి ప్రాణం తీశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే మృతదేహాన్ని దాచిపెట్టి పైచాచిక ఆనందం పొందాడు. విషయం తెలుసుకున్న నిందుతుడి పేరెంట్స్ సైతం ఈ దుర్మార్గాన్ని దాచేందుకు ప్రయత్నించగా చివరికి కటకటాలపాలయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర(Maharashtra) లోని పాల్ఘర్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ బాధాకరమైన సంఘటన డిసెంబరు 1న వసాయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐస్‌క్రీం దుకాణానికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చాలాచోట్ల వెతకగా ఆమె ఆచూకీ తెలియలేదు. అయితే పోలీసు కంప్లైట్ కూడా ఇవ్వడంతో కొన్ని బృందాలుగ ఏర్పడి బాలికకోసం గాలిస్తున్నాం. ఈ క్రమంలోనే తమ పొరుగు ఇంటి నుంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఆ ఇంటి తలుపులు తెరిచి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చదవండి : అగ్గిపుల్ల ఇవ్వలేదని వాచ్మెన్పై యువకుడి దాడి.. తల పగిలేల కొట్టి ఈ క్రమంలోనే యువకుడి తండ్రిని విచారించగా జరిగిందంతా చెప్పాడు. అలాగే ఆ బాలిక తనను హేళన చేయడంతో ఆవేశంతో ఇంటికి పిలిచి చంపినట్లు యువకుడు అంగీకరించాడు. ఆటపట్టించినట్లు చేసి ఇంటికి తీసుకెళ్లి ఆ తర్వాత ఆమెను గొంతు కోసి చంపినట్లు తెలిపాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న అతని తండ్రి కొడుకును జల్నాలోని బంధువుల ఇంటికి పంపించాడు. మృతదేహాన్ని పారవేసేందుకు ప్రయత్నించాడు. కానీ కొన్ని రోజులుగా వీలు కాకపోవడంతో తమ పక్కన ఖాళీగ ఉన్న ఇంట్లో బెల్ట్‌తో డెబ్ బాడీని కట్టేసి ఉంచారు. మృతదేహం కుళ్లిపోవడంతో దుర్వాసన వస్తుందని స్థానికులు సమాచారం అందించగా అసలు విషయం బయపడింది. అయితే బాధితురాలి మృతదేహంతో లభించిన బెల్టు యువకుడికి తన తండ్రి బహుమతిగా ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై విచారణ జరిపి యువకుడితో పాటు అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. #maharashtra #women #harassment-against-woman #psycholu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి