Bangalore: సిని నటిగా ఎదగాలనే పిచ్చితో ఓ యువతి దారుణంగా మోసపోయింది. కొంతకాలంగా స్నేహం చేసి, ఆ తర్వాత ప్రేమించి, సినిమా అవకాశాలు ఇప్పిస్తాని చెప్పడంతో యువకుడికి సర్వం అర్పించింది. ఇదే అదనుగా శారీరక వాంఛ తీర్చుకున్న అతడు ఆమెకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాయచూరుకు చెందిన యువతి..
ఈ మేరకు బెంగళూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయచూరుకు చెందిన ఆ యువతి తన ఫ్యామిలీతో కలిసి 2019 నుంచి బెంగళూరులో నివాసం ఉంటోంది. అయితే కన్నడ, తమిళ సినిమాల్లో సహాయ నటుడిగా పనిచేస్తున్న సంతోశ్ అనే వ్యక్తి తనను వాడుకుని వదిలేశాడని ఓ యువతి (27) జ్ఞానభారతి ఠాణాలో ఫిర్యాదు చేసింది. హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి, తనను శారీరకంగా వాడుకున్నాడని తెలిపింది. ఇదే క్రమంలో తనను ఒంటరిగా మైసూరు, గోవా తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఇది కూడా చదవండి : Deep fake: విరాట్ కోహ్లీని వదలని కేటుగాళ్లు.. వీడియో వైరల్
రహస్యంగా వీడియోలు..
అంతేకాదు తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడని, వాటిని అడ్డుపెట్టుకుని తన వద్ద నుంచి డబ్బులు వసూల్ చేసినట్లు వాపోయింది. అయితే నిందితుడు సంతోష్ కు అప్పటికే పెళ్లి అయిందని, అత్తిబెలెలో కాపురం పెట్టాడు. విషయం తెలుసుకుని నిలదీసిన యువతిని చంపేస్తానంటూ బెదిరించినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. అత్తిబెలె ఠాణాలో గతంలో ఫిర్యాదు చేసినా, స్పందన రాకపోవడంతో జ్ఞానభారతి ఠాణాలో ఫిర్యాదు చేసింది. నిందితుడు గతంలోనూ ఇదే తరహా వంచనలకు పాల్పడ్డాడని, ప్రాథమిక విచారణలో గుర్తించారు. తన వద్దనుంచి ఐఫోన్, బంగారం తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.