Amrit Bharat Express : ప్రయాణికులకు షాక్.. ‘అమృత్‌ భారత్‌’ జర్నీ చాలా కాస్ట్‌లీ!

రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ‘అమృత్‌ భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ చార్జీల వివరాలు వెల్లడించారు రైల్వే అధికారులు. అయోధ్య నుంచి బయల్దేరే తొలి రైలుకు ప్రధాని నరేంద్రమోదీ డిసెంబర్ 30న జెండా ఊపి ప్రారంభించనుండగా మిగతా రైళ్లకంటే ఇందులో 15-17% చార్జీలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

Amrit Bharat Express : ప్రయాణికులకు షాక్.. ‘అమృత్‌ భారత్‌’ జర్నీ చాలా కాస్ట్‌లీ!
New Update

Indian Railways : అతి తక్కువ చార్జీలతో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పలు ప్రాంతాల్లో ట్రైన్ చార్జీలు పెంచుతున్నట్లు అధికారులు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ప్రత్యేక హంగులతో రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ‘అమృత్‌ భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌లోనూ చార్జీలకు సంబంధించి లిస్ట్ విడుదల చేశారు. ఈ మేరకు సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ తదితర తరగతుల్లో సాధారణ రైళ్లకంటే టికెట్(Ticket) ధరలు అధికంగా ఉండబోతున్నట్లు తెలిపారు.

ఈ మేరకు భారతీయ రైల్వే సరికొత్తగా ప్రవేశపెడుతున్న ‘అమృత్‌ భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌(Amrit Bharat Express) అయోధ్య(Ayodhya) నుంచి బయల్దేరే తొలి రైలుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 30న ఆ నగరంలో జెండా ఊపి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ రైళ్లలో ద్వితీయ శ్రేణి, స్లీపర్‌ తరగతుల్లో టికెట్‌ ఛార్జీలు ఇతర మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌ల కంటే  50 కి.మీ.లోపు దూరానికి కనీస టికెట్‌ ధర రూ.35గా నిర్ణయించగా దానికి రిజర్వేషన్‌ ఫీజు, ఇతర ఛార్జీలు అదనంగా ఉండబోతున్నట్లు రైల్వేబోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇది అన్ని జోన్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే ఈ రెండు కంపార్టుమెంట్లతో ప్రయాణించే వారు తదితర క్లాసుల్లో ఏయే దూరానికి ఎంతెంత ఛార్జీలు వసూలు చేసే విషయాన్ని లిస్ట్ రూపంలో అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచగా ప్రయాణికులు దీనిని గమనించాలని సూచించింది.

ఇది కూడా చదవండి : JOBS: పది అర్హతతో ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

అలాగే ప్రభుత్వం తిరిగి చెల్లించని(రీయంబర్స్‌ చేయని) రాయితీ/ ఉచిత టికెట్లను ఈ రైల్లో అనుమతించబోమని తెలిపింది. రైల్వే సిబ్బందికి ఇచ్చే పాసులు, ప్రివిలేజ్‌ టికెట్‌ ఆర్డర్‌ (పీటీవో)ల విషయంలో నిబంధనలు మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌లతో సమానంగా ఉంటాయని స్పష్టం చేసింది. దీంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమరయోధుల టికెట్ల ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తున్నందువల్ల వారి పాసులు/ కూపన్లు ఈ రైళ్లలో చెల్లుతాయని పేర్కొంది. ఇక మొదటి ట్రైన్ లో సెకెండ్‌ క్లాస్‌, స్లీపర్‌ క్లాస్‌ మాత్రమే ఉంటాయని, ఏసీ తరగతుల ఫీజుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు.

#indian-railways #prices #ticket #amrit-bharat #express
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe