IAS Amrapali : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(HMDA) లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండిఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్ లతో పాటు హెచ్ఎండిఏ అధికారులు, సిబ్బంది జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కలసి అభినందించారు.
ALSO READ: BREAKING: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
ఈ సందర్భంగా ఆమె హెచ్ఎండిఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని అన్నారు. తదుపరి మూసి రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా ఆమ్రపాలి(Amrapali) బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు.
ప్రభుత్వం బదిలీ చేసిన అధికారుల వివరాలు, పోస్టింగ్ ల వివరాలివే..
తెలంగాణ(Telangana) లో పలువురు ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి రెండు కీలక బాధ్యతలు అప్పగించారు. హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా, మూసీ రివర్ బోర్డ్ ఎండీగా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఆమ్రపాలి 2010 ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి.
ఇక ఇంధన శాఖ కార్యదర్విగా రిజ్వీని నియమించింది. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే, ట్రాన్స్‌కో జేఎండీగా సందీప్‌కుమార్ జా, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణభాస్కర్, SPDCL సీఎండీగా ముష్రఫ్ అలీ, NPDCL సీఎండీగా కర్నాటి వరుణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బి.గోపి ని నియమించింది ప్రభుత్వం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం