MOOSI : సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి అమ్రపాలి.. మూసీ ప్రక్షాళనపై ఫోకస్

మూసీ ప్రక్షాళనపై రేవంత్‌ సర్కారు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఐఏఎస్ అమ్రపాలి రంగంలోకి దిగి ఇంజనీర్ల బృందంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యమునా రివర్ ను ఆమె సందర్శించారు. రూ. 16,500 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు ప్రారంభించనున్నారు.

New Update
MOOSI : సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి అమ్రపాలి.. మూసీ ప్రక్షాళనపై ఫోకస్

Moosi river: మూసీ ప్రక్షాళనపై రేవంత్‌ (CM Revanth)సర్కారు ఫోకస్ చేస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ గా (MRDCL) ఉన్న ఐఏఎస్ అమ్రపాలి (Amrapali).. సీఎం ఆదేశాలతో మూసీ ప్రక్షాళన కోసం యాక్షన్‌ ప్లాన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నమామి గంగా ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ (Ashok kumar) తో చర్చలు జరిపింది అమ్రపాలి బృందం.

రూ. 16,500 కోట్లతో సుందరీకరణ..
తెలంగాణలో గత ప్రభుత్వం రూ. 16,500 కోట్లతో మూసీని సుందరీకరణ చేసేందుకు ప్రణాళికలు రచించినప్పటికీ అమలు చేయలేకపోయింది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ మూవీ సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. మూవీ నది మొదలైన ప్రదేశం నుంచి చివరి వరకూ సుందరీకరణ చేసేందుకు రేవంత్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల గుజరాత్‌ (Gujarath)లో పర్యటించిన అమ్రపాలి టీమ్‌.. జనవరి 3న అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిని సందర్శించారు. ఆ తర్వాత జనవరి 6న యుమనా నదిని కూడా సందర్శించి ఇంజనీర్లనుంచి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి: Kangana : ఆ కేసుపై స్టే విధించండి.. ముంబై కోర్టుకు కంగన రిక్వెస్ట్

గుజరాత్ ప్రాజెక్టుల సందర్శన..
ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి ఆధ్వర్యంలో అధికారుల బృందం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును, యమునా రివర్ ను సందర్శించి అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమై అధ్యయనం చేశారు. ఆయా ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP)లను, వాటి సామర్థ్యాన్ని పరిశీలించారు. అహ్మదాబాద్ మున్సిపల్ ఉన్నతాధికారి తెన్నరసన్, సబర్మతి రివర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్(సిఇ) జగదీష్ పటేల్, జనరల్ మేనేజర్(జిఎం) సుశాంత్ భాటియా, నమామి గంగా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడి) విశిష్ట, ఉన్నతాధికారులు ఎన్. కే.మదన్, పీయూష్ గుప్తా తదితరులతో మూసి రివర్ ఫ్రంట్ అధికారులు సమావేశం అయ్యారు. రెండు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల అధికారులతో ప్లాన్ గురించి చర్చించారు. ఏది ఏమైనా త్వరలోనే మూసీ సుందరీకరణకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు