![Kangana : ఆ కేసుపై స్టే విధించండి.. ముంబై కోర్టుకు కంగన రిక్వెస్ట్](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-66-jpg.webp)
Mumbai : బాలీవుడ్(Bollywood) నటి కంగనా రనౌత్(Kangana Ranaut) తనపై వేసిన పరువునష్టం దావా(Defamation Case)కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ ముంబై (Mumbai) హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తనపై సినీ రచయిత జావేద్ అక్తర్(Javed Akthar) వేసిన కేసుతోపాటు తాను వేసిన క్రాస్ పిటిషన్‌ను కూడా విచారించాలని న్యాయస్థానాన్ని రిక్వెస్ట్ చేశారు.
పరువునష్టం దావా..
ఈ మేరకు 2020లో నేషనల్ టీవీ ఛానళ్ల(National TV Channels) లో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ జావేద్ అక్తర్ కంగనపై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో నేరపూరిత కుట్ర, గోప్యతకు భంగం కలిగించడం వంటి ఆరోపణలతో అక్తర్‌పై కంగన సైతం క్రాస్ పిటిషన్ వేశారు. దీంతో 2023, జులై 24న అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు అక్తర్‌కు సమన్లు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా దిండోషిలోని సెషన్స్ కోర్టులో ఆయన రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే కంగన ఫిర్యాదుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్, సమన్ల జారీపై స్టే విధించిన న్యాయస్థానం.. తాజాగా ఈ కేసులో కంగన వేసిన పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. జనవరి 9న విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Murder : ఎమ్మెల్సీ సోదరుడు.. మాజీ మావోయిస్టు దారుణ హత్య!
అసలేం జరిగింది..
2020లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్ నటుడు హృతిక్ రోషన్( ) తో గొడవ గురించి సంచలన కామెంట్స్ చేసింది. హృతిక్ తనను నమ్చించి మోసం చేశాడంటూ ఆరోపణలు చేసింది. అలాగే రచయిత జావేద్ కూడా తనను ఇంటికి పిలిచి బెదిరించాడంటూ ఆరోపణలు చేయగా ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. దీంతో కంగన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జావేద్ ఆమెపై పరువునష్టం దావా వేశారు. అక్తర్, తన ఫిర్యాదులు ఒకే సంఘటనకు సంబంధించినవనీ.. రెండు విరుద్ధ తీర్పులను నివారించడానికి వాటిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని కంగన తాజాగా హైకోర్టును కోరారు. తన పిటిషన్‌పై విచారణ ఆగిపోయిందని, అక్తర్‌ది మాత్రం కొనసాగుతోందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కంగన ఆవేదన వ్యక్తం చేసింది.