Beauty Tips : గడ్డం తెల్లగా అవుతుందని బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే నల్లగా మారడం ఖాయం

గడ్డం నెరవడం అనేది జన్యు ప్రక్రియ అయినప్పటికీ ఈ రోజుల్లో చాలా యువకుల గడ్డాలు తెల్లగా మారుతున్నాయి. ఉసిరి పొడిని నీటితో కలిపి పేస్ట్ లా చేసి గడ్డానికి అప్లై చేస్తే గడ్డం నల్లగా మారుతుంది. గడ్డానికి హాని కలిగించే రసాయన ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించకూడదు.

New Update
Beauty Tips : గడ్డం తెల్లగా అవుతుందని బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే నల్లగా మారడం ఖాయం

Beauty Tips : గడ్డం(Bread) నెరిసిపోవడం అనేది చాలా మందిలో కనిపిస్తోంది. గడ్డం నెరవడం అనేది జన్యు ప్రక్రియ అయినప్పటికీ ఈ రోజుల్లో చాలా యువకుల గడ్డాలు తెల్లగా మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ నల్ల గడ్డం(Black Bread) కలిగి ఉండాలని కోరుకుంటారు. తెల్ల గడ్డాన్ని(White Bread) నల్లగా మార్చే అనేక ఉత్పత్తులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల తెల్ల గడ్డాన్ని నల్లగా మార్చుకోవచ్చు.

కొబ్బరి నూనె, నిమ్మకాయ:

  • నిమ్మ ఆకులలో(Lemon Leaves) విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రంగును మారుస్తాయి. కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసి దానిలో కొన్ని నిమ్మ ఆకులను వేయాలి. చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని గడ్డానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల గడ్డం నల్లగా మారుతుంది.

ఉసిరి:

  • జుట్టును నల్లగా మార్చడానికి ఉసిరి(Amla) బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి పొడిని నీటితో కలిపి పేస్ట్ లా చేసి గడ్డానికి అప్లై చేసుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత కడిగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ డై వేసుకోవడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా ఉంటుంది. విటమిన్ B12, ఐరన్‌, జింక్ వంటి పోషకాలు కూడా అందుతాయి.

ధ్యానం, యోగా:

  • ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా ఉపయోగపడుతుంది. జుట్టు ఊడిపోవడం కూడా ఒత్తిడి వల్లే జరుగుతుందని నిపుణులు అంటున్నారు. గడ్డానికి హాని కలిగించే రసాయన ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి:  పాలిష్‌ చేసిన బియ్యం తింటే ఏమవుతుంది?..అసలు ఏ బియ్యం తినాలి?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు