Amit Shah: మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!! మధ్యప్రదేశ్ ఎన్నికల వేళ..కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన హామీ ప్రకటించారు. బీజేపీని గెలిపిస్తే..అయోధ్య రాముడి దర్శనం ఫ్రీగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి 2 రోజులు సమయం ఉండగా అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. By Bhoomi 13 Nov 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 17వ తేదీన జరగనున్నాయి. ఇంకో రెండు రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ సంచలన హామీని ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యప్రదేశ్ వాసులకు అయోధ్యలోని రామమందిరానికి ఉచితంగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దఫాలుగా ఇక్కడి ప్రజలను తీసుకెళ్లి రామమందిరాన్ని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయిస్తామని చెప్పారు. సోమవారం మధ్యప్రదేశ్ లోని విదిశలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ తరచూ యూపీలో అయోధ్య రామమందిరం నిర్మాణం తేదీ గురించి అడిగేవారని అన్నారు. రాహుల్ గాంధీకి ఇప్పుడు తాను సమాధానం చెబుతున్నా అని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని ఈ వేదికపై నుంచి రాహుల్ గాంధీకి సమాధానం చెబుతున్నాను అంటూ వివరించారు. కాగా ఓ బీజేపీ నేత తాము అయోధ రామమందిరం దర్శనం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందా అని ప్రశ్నించాడు. దానికి అమిత్ షా సమాధానం ఇస్తూ...ఈ హామీ ఇచ్చారు. రామమందిరానికి వెళ్లాలంటే ఎలాంటి డబ్బు చెల్లించాల్సి అవసరం లేదని ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చని వివరించారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే తామే రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందరి దర్శనం చేయిస్తామంటూ హామీ ఇచ్చారు అమిత్ షా. ఇది కూడా చదవండి: బరువు తగ్గాలంటే కష్టపడాల్సిన పనిలేదు..ఈ ఆకు తింటే చాలు..!! " width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"> #amit-shah #ayodhya-temple #ayodhya-ram-temple #madhya-pradesh-elections #amit-shah-in-madhya-pradesh #ayodhya-ram-temple-visiting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి