TS Politics: వాళ్లతో ఇప్పుడే కాదు..భవిష్యత్‌లోనూ కలిసేది లేదు.. కుండబద్దలు కొట్టిన అమిత్‌షా!

బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేదే లేదని కుండబద్దలు కొట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. ఖమ్మం సభ తర్వాత జరిగిన బీజేపీ కొర్ కమిటీ మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఖమ్మం సభలో అమిత్‌షా వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. బ్యాట్ కూడా సరిగ్గా పట్టుకోలేని అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐలో కీలక పదవిని ఎలా పొందారో అందరికి తెలిసిందేనని ఫైర్ అయ్యారు.

TS Politics: వాళ్లతో ఇప్పుడే కాదు..భవిష్యత్‌లోనూ కలిసేది లేదు.. కుండబద్దలు కొట్టిన అమిత్‌షా!
New Update

BRS vs BJP: తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) రాకతో రాజకీయాలు హీటెక్కాయి. ఖమ్మం సభ తర్వాత బీజేపీ కొర్ కమిటీ మీటింగ్ జరగగా.. ఈ భేటీలో అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌(BRS)తో ఇప్పుడే కాదు భవిష్యత్‌లోనూ కలిసి పని చేసేది లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీతో కలిసిపోయేది ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదన్నారు అమిత్‌షా. తెలంగాణ అనుకూల వాతావరణం ఉందని.. అధికారంలోకి వస్తాం అని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్‌ ఏఐసీసీ ఛీఫ్‌ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యలను తిప్పి కొట్టాలని చెప్పారు.

గెలిచేవారికి సీటు:
వచ్చే ఎన్నికల్లో జన బలం ఉన్న నేతలకే ప్రాధాన్యమిస్తామని అమిత్‌షా ఈ భేటీలో స్పష్టం చేసినట్టు సమాచారం. పార్టీలో చేరికలను వేగవంతం చేయాలని అమిత్‌షా తెలిపారు. పోటీ చేసేదెవరు? ఎన్ని స్థానాలు గెలుస్తామో కచ్చితంగా నివేదికలు ఇవ్వాలని అదేశాలు జారీ చేశారు అమిత్‌షా ఏ జిల్లాల్లో గెలుస్తాం.. ఎక్కడ రెండో స్థానంలో ఉంటామన్నదానిపై రిపోర్ట్ ఇవ్వాలని అమిత్‌షా కోరినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను బీజేపీ కొర్ కమిటీ మీటింగ్‌లో నేతలను అడిగి తెలుసుకున్నారు అమిత్‌షా.

అమిత్‌షాకు కౌంటర్:
మరోవైపు అమిత్‌షా వ్యాఖ్యలను అధికార బీఆర్‌ఎస్‌ తిప్పికొట్టే పనిలో ఉంది. కేసీఆర్‌ (KCR), బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావు (Harish rao) కౌంటర్‌ ఇచ్చారు. తప్పుడు విమర్శలు, కాలం చెల్లిన ఆరోపణలతో చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సీఎంని టార్గెట్ చేయడం కంటే.. పనితీరును మెరుగుపరుచుకుని తెలంగాణలో కనీసం ఒక్క సీటునైనా గెలుచుకోవడంపై దృష్టి పెట్టాలని బీజేపీ నాయకత్వానికి సూచించారు. తెలంగాణ ప్రజలు విరిగిన, పాడైన బియ్యాన్ని తినాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు బీజేపీ మూల్యం చెల్లించుకుంటుందన్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)లో అమిత్‌షా కుమారుడు జయ్ షా కీలక పదవికి ఎదగడాన్ని ఆర్థిక మంత్రి ప్రశ్నించారు. “బ్యాట్ కూడా సరిగ్గా పట్టుకోలేని అమిత్ షా తనయుడు జై షా (Jay Shah) బీసీసీఐలో కీలక పదవిని ఎలా పొందాడో అందరికీ తెలిసిందే . మీరు రాజవంశ పాలన గురించి మాట్లాడటం వంచనకు తక్కువ కాదు, ”అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు.

ALSO READ: ఢిల్లీకి చేరిన దొంగ ఓట్ల పంచాయతీ.. ఈసీకి వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఫిర్యాదులు!

#amit-shah #brs-vs-bjp #amit-shahs-khammam-tour #brs-party #cm-kcr #harish-rao #khammam-bjp-meeting
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి