Joe Biden : ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా(America) అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్, ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధ కొనసాగుతూనే ఉంది. గతంలో ట్రంప్(Donald Trump).. వయసును ప్రస్తావిస్తూ అవహేళన చేశారు. బైడెన్ తడబాటు, వయసు, మతిమరపు వంటివి పేర్కొంటూ ఆయన కంటే తానే మెరుగైన అధ్యక్షుడిని అవుతానని అన్నారు. అయితే తాజాగా జో బైడెన్ కూడా ట్రంప్‌పై సెటైర్లు వేశారు. డోనాల్డ్ ట్రంప్‌ను ఆరేళ్ల పిల్లాడిగా అభివర్ణించారు బైడెన్. '2024 ఎన్నికలు సన్నహకాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో నా వయసు కూడా ఓ అంశమే. ఈ ఎన్నికల్లో నేను ఆరేళ్ల పిల్లాడితో పోటీపడుతున్నాని' బైడెన్ అన్నారు.
Also Read: వాట్సాప్ VS కేంద్ర ప్రభుత్వం.. కోర్టుకు వెళ్లిన పంచాయితీ
శనివారం వైట్‌హౌస్(White House) లో కరెస్పాండెంట్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న బైడెన్ ఈ విధంగా ట్రంప్‌పై చురకలంటించారు. ఇజ్రాయేల్-హమాస్(Israel-Hamas) యుద్ధంపై అమెరికాలో ఆందోళనలు, అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో దాదాపు 3 వేల మంది జర్నలిస్టులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. అయితే ఇజ్రాయెల్ విషయంలో బైడెన్ తడబడ్డారని విమర్శలు వస్తున్నాయి. బైడెన్ తన ప్రసంగంలో మాట్లాడుతూ.. ' ట్రంప్ గత కొన్ని రోజుల నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రతికూల వాతావరణం అనుకోవచ్చని.. ట్రంప్ - స్టార్మీ డేనియల్స్ ఎఫైర్‌ను పరోక్షంగా ప్రస్తావించారు.
'ప్రజాస్వామ్యంపై దాడి చేయాలనే ఉద్దేశాన్ని ట్రంప్ ఎప్పుడూ దాచుకోలేదు. మొదటి నుంచే తాను డిక్టేటర్‌లా వ్యవహరిస్తానని ట్రంప్ చెప్పారు. తన మద్దతుదారుల తరఫును ప్రతీకారం తీర్చుకుంటానని.. ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చెబుతున్నారు. గతంలో అమెరికా అధ్యక్షులు ఎవరైనా ఇలా మాట్లాడటం విన్నామా ? ట్రంప్‌ను మనం సీరియస్‌గా తీసుకోవాలని' బైడెన్ అన్నారు.
Also Read: టైటానిక్ వాచ్ ఎన్ని వందల కోట్ల ధర పలికిందో తెలుసా!