బ్రో సినిమా పెద్ద స్కామ్.. అధికారులు దృష్టి పెట్టాలి ..పవన్ కల్యాణ్ పై అంబటి ఫైర్

పవన్‌ కళ్యాణ్‌ నటించిన బ్రో సినిమాపై నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్‌ ఈ సినమా ద్వారా పలువురిని అవమాన పరిచారని విమర్శించారు. ఈ సినిమాకు పవన్‌ తీసుకున్న రెమ్యునేషన్‌కు సంబంధించిన డాక్యూమెంట్లను ఐటీ అధికారులకు చూపించాలని మంత్రి సవాల్‌ చేశారు

బ్రో సినిమా పెద్ద స్కామ్.. అధికారులు దృష్టి పెట్టాలి ..పవన్ కల్యాణ్ పై అంబటి ఫైర్
New Update

పవన్ కళ్యాణ్‌ ఇటీవల నటించిన బ్రో సినిమా ఓ పెద్ద స్కామ్‌ అని మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పవన్‌ కళ్యాణ్‌ శ్యామ్‌ బాబు పాత్రలో నటించారని, ఆ పాత్రలో పవన్‌ పలువురిని వక్రీకరించే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. బ్రో సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయిందన్న అంబటి.. ఈ సినిమా కలెక్షన్లు పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న రెమ్యునేషన్ స్థాయిలో కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ సినిమాను కాంట్రవర్సీ  చేస్తే డబ్బులు వస్తాయని ఆర్టిస్టులు భ్రమలో ఉన్నారన్నారు. సినిమాను సినిమాగా తీయాలని, అలా చేయలేదు కాబట్టే సినిమా  అట్టర్‌ ప్లాప్‌ అయిందని చెప్పారు.

పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమా ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించారు. ఇందులో టీడీపీ హస్తం కూడా ఉందని అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా డబ్బులను కలెక్ట్‌ చేసి చంద్రబాబు ఈ సినిమా నిర్మాతకు ఇచ్చారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న అమౌంట్‌ ఇన్‌కం ట్యాక్స్‌కు చూపించారా అని ఆయన ప్రశ్నించిన ఆయన.. ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్కరు దీనిని గమనించాలన్నారు. ముఖ్యంగా అధికారులు దీనిపై దృష్టి పెట్టాలన్నారు. చంద్రబాబు బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చి చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌కు ఇచ్చారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ చిత్రాలు ఇక ఆడవని అంబటి రాంబాబు తెలిపారు.

మరోవైపు జనసేన అధ్యక్షుడు తన వాహనానికి వారాహి పేరు పెట్టి వాహనం ఎక్కిన పవన్‌కు అమ్మవారి శాపం తగిలిందని ఆరోపించారు. పవన్‌ కళ్యాణ్‌పై తాము త్వరలోనే సినిమా తీస్తామన్న మంత్రి.. పవన్‌ పెళ్లిళ్లపై సినిమా తీయబోతున్నట్లు, దానికి సంబంధించి సినిమాకు టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లో పవన్‌ కళ్యాణ్‌ ఇక ఎదగలేరని అభిప్రాయపడ్డారు. పవన్‌ ఎప్పుడు తన వాహనానికి అమ్మవారి పేరు పెట్టారో అప్పటి నుంచే రాజకీయంగా దిగజారడం ప్రారంభమైందని పేర్కొన్నారు.

#chandrababu #jagan #ambati-rambabu #scam #bro-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe