WhatsApp: వాట్సాప్‌లో అమేజింగ్ ఫీచర్..యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు..!!

Whatsapp కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని సహాయంతో మీరు లాక్ స్క్రీన్‌లోనే స్పామ్ సందేశాలను బ్లాక్ చేయవచ్చు.అప్ డేట్ స్పామ్ మెసేజ్ ల వ్యాప్తిని పరిష్కరించడం, యూజర్లు వారి మెసేజింగ్ ఎక్స్ పీరియర్స్ పై మరింత కంట్రోల్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

WhatsApp: వాట్సాప్‌లో అమేజింగ్ ఫీచర్..యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు..!!
New Update

Whatsapp New Feature: వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సహాయంతో యూజర్లు తమ లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ కాంటాక్ట్స్ ను బ్లాక్ చేయవచ్చు. ఆ అప్ డేట్ స్పామ్ మెసేజ్ లవ్యాప్తిని (Spam Messages) పరిష్కరించడం, యూజర్లు వారి మెసేజింగ్ ఎక్స్ పీరియన్స్ పై మరింత కంట్రోల్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్ వంటి మెసేజింగ్ నెట్ వర్క్ లకు స్పామ్ మెసేజ్ లు చాలా కాలంగా ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.

స్పామ్ సందేశాల కారణంగా, ప్రచార కంటెంట్ నుండి మోసపూరిత కంటెంట్ వరకు యూజర్లు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు స్పామ్ సందేశాల ద్వారా మోసానికి గురయ్యారు. అటువంటి పరిస్థితిలో, WhatsAppలోని ఈ ఫీచర్ చాలా ముఖ్యమైనది. ఇటువంటి స్పామ్ సందేశాలను నివారించడానికి, వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమ లాక్ స్క్రీన్ నుండి స్పామ్ సందేశాలపై చర్య తీసుకోని..వాటిని బ్లాక్ చేయవచ్చు.

ఈ ఫీచర్‌ని (Whatsapp New Feature) అమలు చేయడం వెనుక వాట్సాప్ లక్ష్యం దాని యూజర్లు గొప్ప సందేశ అనుభవాన్ని అందించడంతోపాటు వారి గోప్యత, భద్రతను పెంచడం. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ వినియోగదారులు వారి డివైజ్ ను అన్‌లాక్ చేయకుండా లేదా యాప్ ద్వారా నావిగేట్ చేయకుండా స్పామ్ సందేశాలను గుర్తించడానికి, బ్లాక్ చేయడానికి అనుమతిస్తుంది. లాక్ స్క్రీన్‌పై స్పామ్ సందేశం గురించిన నోటిఫికేషన్ కనిపించినప్పుడు, పంపినవారిని వెంటనే బ్లాక్ చేసే ఎంపికతో సహా బహుళ ఎంపికలను చూడటానికి వినియోగదారులు నోటిఫికేషన్‌పై ఎక్కువసేపు నొక్కవచ్చు. ఇది కాకుండా, వాట్సాప్ ఆ పంపినవారికి రిపోర్ట్ (Report) చేసే ఆప్షన్ కూడా ఇస్తుంది.

ఈ రోజుల్లో, వినియోగదారులు ప్రతిరోజూ వాట్సాప్‌లో చాలా స్పామ్ సందేశాలను స్వీకరిస్తూనే ఉన్నారు. దీని కారణంగా వినియోగదారులు మానసికంగా కలవరపడటమే కాకుండా కొన్ని నకిలీ లేదా తప్పుడు ప్రకటనల బారిన పడి మోసానికి గురవుతారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, వాట్సాప్ తీసుకువచ్చిన ఈ ఫీచర్ వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్!

#whatsapp-feature #spam #whatsapp #spam-message #whatsapp-update #whatsapp-new-feature
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి