AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కేసు వాయిదా

అమరావతి అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈకేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు అందిస్తామని సీఐడీ చెప్పడంతో కోర్టు ఈ విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.

New Update
AP Skill Case: ఏపీ స్కిల్ కేసులో మరో ట్విస్ట్.. ఆ 12 మంది ఐఏఎస్ లకు ఉచ్చు?

Amaravati Assigned Lands case: అమరావతి అసైన్డ్ భూముల కేసును ఏపీ హైకోర్టు (AP High Court) నవంబర్ 1కి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. కానీ కొత్త ఆధారాలు పరిగణలోకి తీసుకుని విచారించాలంటూ సీఐడీ (AP CID) కోర్టులో పిటిషన్ వేసింది. సీఐడీ అధికారులు వేసిన పిటిషన్లను స్వీకరించిన కోర్టు ఈరోజు విచారణ చేసింది. అసైన్డ్ ల్యాండ్ కేసులో సీఐడీ అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను పరిశీలించింది.కేసు రీఓపెన్ చేసేందుకు ఏమైనా అభ్యంతరాలుంటే కౌంటర్ దాఖలు ప్రతివాదులకు సూచించింది. హైకోర్టుకు సీఐడి తరపున న్యాయవాదులుఆడియో ఫైల్స్ ను అందించారు. రేపు మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందిస్తామని చెప్పారు. దీంతో ఉన్నత న్యాయస్థానంతదుపరి విచారణ వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా వేసింది.

Also Read: విశాఖలో ఇన్ఫోసిస్.. నేడు ప్రారంభించనున్న జగన్.. వివరాలివే!

అసైన్డ్ భూముల కేసులో..రాజధాని గ్రామాల పరిధిలో అసైన్డ్ భూములు సేకరణలో బాబు, మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ 2021లో కేసు నమోదు చేసింది. దాని మీద ఇంతకు ముందే విచారణ పూర్తి కాగా సైడీ మరో రెండు కొత్త కేసులను వేస్తూ పిటిషన్ ను దాఖలు చేసింది. మరోవైపు అసైన్డ్ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ ఈ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో నారాయణ (Narayana) ,చంద్రబాబు (Chandrababu) పిటిషన్లు వేశారు. దీంతో పాటూ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్ పై మరోసారి ఏపీ హైకోర్టు విచారించనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు A1 గా ఉన్నారు.

మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. ఈ విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Also Read: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ, మాజీ ఎమ్మెల్యే?

Advertisment
Advertisment
తాజా కథనాలు