AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఏపీలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు అధికారులు. By Vijaya Nimma 20 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP Cabinet Key Decisions మరో కొత్త పథకం ఏపీ సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఏపీలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్ సర్వీసెస్ (Jagananna Civil Services) ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు అధికారులు. ఏపీ రాష్ట్రంలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి రూ.50వేలు, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే రూ.లక్ష ఇవ్వాలని ఏపీ కేబినెట్‌లో నిర్ణయించారు. కీలక అంశాలపై చర్చ అయితే.. దీనిలో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఏపీలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లులు, జీపీఎస్ ముసాయిదాపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష, కురుపాం ఇంజినీరింగ్ కాలేజీలో గిరిజనులకు 50 శాతం సీట్లు ఇచ్చే అంశంపై భేటీలో చర్చ జరిగింది.ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ బిల్లు అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్థలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ (Aarogyasri) కింద కవర్ అయ్యేలా చూడాలని భేటీలో సీఎం జగన్ కోరారు. మొత్తం 49 అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. కేబినెట్ ఆమోదం ఏపీ కేబినెట్ భేటీ బుధవారంనాడు ఏపీ సచివాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభైంది. కేబినెట్ ఎజెండాలోని 49 అంశాలపై చర్చించారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానునున్న నేపథ్యంలో .. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. Also Read: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే #cm-jagan #amaravathi #ap-cabinet-meeting #decisions #ap-cabinet-key-decisions #jagananna-civil-services మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి