Tirumala : అమరావతి (Amaravati) ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేలా ఏపీ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని (Capital) పనులు తిరిగి ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల వెంకటేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, మొక్కు చెల్లించుకోవడానికి రైతులు యాత్ర (Farmers Yatra) మొదలు పెట్టారు.
సోమవారం ఉదయం రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం (Venkateshwara Swamy Temple) నుంచి కృతజ్ఞతా యాత్రను రైతులు ప్రారంభించారు. ఈ పాదయాత్రలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరావతి రైతుల యాత్రను తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కాగా, రైతులు చేపట్టిన ఈ పాదయాత్ర సుమారు 20 రోజుల పాటు కొనసాగనుందని, తిరుమల చేరుకున్నాక రైతులు వెంకన్నకు మొక్కులు చెల్లించుకుంటారని ఎమ్మెల్యే శ్రావణ్ తెలిపారు.