/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Screenshot-2024-08-09-125405.png)
Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల 57 కేజీల విభాంగలో ఫైనల్ కు చేరడంలో విఫలం అయిన అమన్..ఈరోజు జరిగిన బ్రాంజ్ మెడల్ బౌట్ లో విజయం సాధించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ 13-5 పాయింట్లతో ప్యూర్టోరికో ఆటగాడు డేరియన్ క్రూజ్ మీ గెలచాడు.దీంతో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇందులో ఒక రజతం.. ఐదు కాంస్యాలు ఉన్నాయి. అమన్ బౌట్ మొదలయిన దగ్గర నుంచే ఆధిక్యం ప్రదర్శంచాడు. బౌట్ ఆరంభంలో క్రూజ్ పాయింట్ సాధించి లీడ్ లోకి వెళ్ళాడు. కానీ వెంటనే తేరుకున్న అమన్ క్రూజ్‌కు ధీటుగా రెండు పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత క్రూజ్ మరో రెండు పాయింట్లు సాధించాడు. అక్కడి నుంచి అమన్‌ను ఆపడంక్రూజ్ వల్ల కాలేదు.చివరి నిమిషాల్లో దూకుడు ప్రదర్శించిన అతను వరుసగా పాయింట్లు సాధిస్తూ భారీ ఆధిక్యంలో నిలిచాడు. పోటీ ముగిసేంవరకు తన ఆధిక్యాన్ని నిలుపుకోవడంలో సఫలం అయ్యాడు.
అంతకు ముందు నార్త్ మెసడోనియా రెజ్లర్ వ్లాదిమిర్ ఇగొరొవ్ పై మన్ 10–0 తేడాతో గెలిచి సెమీ ఫైనల్ కు చేరుకున్నాడు. అయిఏ సెమీస్‌లో మాత్రం సెహ్రావత్‌కు నిరాశ ఎదురయింది. జపాన్ రెజ్లర్ రె హిగుచి చేతిలో ఓడిపోయాడు. దీంతో అమన్ సిల్వర్ లేదా గోల్డ్ పతకాలను సాధించే అవకాశాలను కోల్పోయాడు.
Also Read:Paris Olympics: ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతాకధారిగా శ్రీజేశ్‌కు అవకాశం