AP News: పండగ రోజు ఇల్లు గుల్ల.. అమలాపురంలో దొంగల బీభత్సం

ఏపీలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరస దొంగతాలు చేస్తూ ప్రజలు భయబ్రతులకు గురి చేస్తున్న దొంగలు. పండగ సందర్భంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి అందినకాడికి దొచుతెళ్తున్నారు. తాజాగా మరో ఘటన కలకలం రేపింది.

New Update
AP News: పండగ రోజు ఇల్లు గుల్ల.. అమలాపురంలో దొంగల బీభత్సం

Ambedkar Konaseema District: దీపావళి పండగ రోజున ఇల్లు దోచేశారు దొంగలు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగల బీభత్సం సృష్టించారు. ఎవరు లేని సమయంలో తలుపుల తాళాలు పగలకొట్టి బీరువాలోని బంగారం, నగదును దుండగులు ఎత్తుకుని వెళ్ళిపోయ్యారు. దీపావళి సెలవులు రావడంతో పాలకొల్లు బంధువులు ఇంటికి వెళ్లిన సమయంలో ఇంటి దోపిడీ జరిగింది. సుమారు రూ.17 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారం, లక్షా 32 వేలు నగదు దొంగలు దోచుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలతో దర్యాప్తు చేసి నిందితులు పట్టుకుంటామని డీఎస్పీ అంబిక ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఆలయానికి వెళ్ళి వచ్చే సరికి చోరీ

గత నెల 10న కాకినాడ జిల్లాలోని రాయుడుపాలెం సచివాలయం 4 భవానీనగర్ దగ్గర ఓ ఇంట్లో భారీ చోరీ కలకలం రేపిన విషయం తెలిసిందే. భవానీనగర్‌లో గంటాల రోజా, శ్యామల రావు దంపతులు అద్దెకు ఉంటున్నారు. సామర్లకోట భేమేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరచి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న సర్పవరం పోలీసులు, పరిస్థితిని పరిశీలించారు. సుమారు 30 తులాల బంగారం, 11 లక్షల నగదు అపహరణ జరిగినట్లు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించామని పోలీసులు తెలిపారు. సర్పవరం సీఐ మురళీకృష్ణ తన టీమ్‌తో సమాచారం సేకరించారని, చోరికి పాల్పడిన వారినీ గుర్తించి త్వరిత గతిన కేసును చేధిస్తామని వెల్లడించారు. ఇదిలాంటే..

ఇది కూడా చదవండి:దమ్మపేటలో బీఆర్‌ఎస్‌ ధూంధాం..13న కేసీఆర్‌ భారీ సభ

మరోఘటన గతనెల17న ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఓ ఇంట్లో దొంగల బీభత్సం సృషించిన విషయం తెలిసిందే. నందిగామ పాత కరెంట్ ఆఫీస్ రోడ్‌లో ఓ ఇంట్లో బీరువా తాళాలు పగలకొట్టి 32 కేజీల వెండి,700 గ్రాములు బంగారాన్ని దొంగలు అపహరించారు. 32 కేజీల వెండి,700బంగాం చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇంటి యజమాని. కూతురు కాలేజీ సీట్‌ కోసం హైదరాబాద్ వెళ్ళిగా.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ చోరీ జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఇలా పలు చోట్లు వరస చోరీలు చేస్తూ పోలీసులకే పెద్ద టాస్క్‌ ఇస్తున్నారు దొంగలు.

Advertisment
తాజా కథనాలు