Amala Paul : పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఎట్టకేలకు బేబీ బంప్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ

నటి అమలాపాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే ప్రియుడు జగత్ దేశాయ్ ని పెళ్లాడిన నటి త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్ ఫొటోలను పోస్ట్ చేస్తూ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Amala Paul : పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఎట్టకేలకు బేబీ బంప్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ
New Update

Amala Paul Shared Baby Bump : బోల్డ్ బ్యూటీ అమలాపాల్(Amala Paul) తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే ప్రియుడు జగత్ దేశాయ్(Jagath Desaii) ని పెళ్లాడిన నటి త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సోషల్ మీడియా(Social Media) వేదికగా బేబీ బంప్ ఫొటోలను పోస్ట్ చేస్తూ మురిసిపోగా ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఈ మేరకు తన భర్త జగత్ తో కలిసిన తన బేబీ బంపు(Baby Bump) ను పట్టుకుని, పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ.. 'Now I know that 1+1 is 3 with you!' (నీతో (భర్త జగత్ దేశాయ్) 1+1= 3 అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది' అనే క్యాప్షన్ తో ఇన్ స్టా(Insta) వేదికగా ఫొటోలను షేర్ చేసింది. ఇందులో రెడ్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని అందంగా కనిపించగా.. భర్త జగత్ దేశాయ్ గుండెలో అమలా పాల్ ఉన్నట్లుగా ఫొటోషూట్ చేశారు. మరో ఫొటోలో బేబీ బంప్ పట్టుకుని ఫొటోకు పోజు ఇచ్చారు. ఇంకో ఫొటోలో అమలా పాల్ కాళి వేళ్లపై నిల్చుని జగత్ దేశాయ్‌ను కిస్ చేస్తున్నట్లుగా ఉంది. అయితే దీనిపై స్పందిస్తున్న కొంతమంది ఫ్యాన్స్ రెండు నెలలకే ఆరు నెలల గర్భం ఉన్నట్లు కనిపిస్తోందని, పెళ్లికి ముందే ప్రగ్నెంట్ అయిందంటూ బలంగా చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : Sreeleela: ‘గుంటూరు కారం’తో శ్రీలీల ఘాటు పెంచిందా.. ఆ నాటు స్టెప్పులకు మహేష్ సెట్లో ఊగిపోయాడా!

ఇదిలా ఉంటే.. అమలా పాల్ తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో గతేడాది జూన్ నుంచి డేటింగ్‌లో ఉంది. కేరళ(Kerala) లోని కోచ్చిలో నవంబర్ 5న అమలా పాల్, జగత్ దేశాయ్ పెళ్లి చేసుకుని వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి పది రోజుల ముందు అమలా పాల్ తన పుట్టినరోజు నాడు అక్టోబర్ 26న ఆమెకు ప్రపోజ్ చేశాడు జగత్ దేశాయ్. అప్పుడు పెళ్లికి ఎస్ చెప్పింది అమలా పాల్. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. పెళ్లైన రెండు నెలలకు తాను గర్భవతినంటూ అమలా పాల్ వెల్లడించింది. ఇదివరకు గతంలో అమలా పాల్ డైరెక్టర్ విజయ్‌తో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ, అనంతరం మనస్పర్థల కారణంగా అమలా పాల్, విజయ్ విడాకులు తీసుకున్నారు. ఇగ జగత్ దేశాయ్‌ది సినిమా నేపథ్యం కాదు. కానీ, సినిమా వాళ్లలో కొందరికీ బాగా తెలిసిన వ్యక్తి అని తెలుస్తోంది. జగత్ దేశాయ్ ఈవెంట్ ఆర్గనైజర్‌గా చేస్తున్నట్లు సమాచారం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా జగత్ దేశాయ్, అమలా పాల్ పరిచయం అయినట్లు, అది కాస్తా ప్రేకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమలా పాల్ ప్రస్తుతం ఆడుజీవితం(ది గోట్ లైఫ్) మూవీలో నటిస్తోంది. ఇందులో సలార్(Salaar) నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా బ్లెస్సీ దర్శకత్వంలో రానుంది. ఇదే కాకుండా ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో అమలా పాల్ నటిస్తోంది.

#amala-paul #social-media #jagath-desaii #baby-bump
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe