Allu Arjun: బన్నీ ఇప్పుడు ఈ సాహసం అవసరమా?

తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్‌ సినిమా తీయబోతున్నాండంటూ సినీ పరిశ్రమలో ఓ వార్త హల్‌ చల్‌ చేస్తుంది. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అట్లీ తీసిన జవాన్ సినిమా మిక్సీలో వేసి కొట్టినట్లు ఉందని అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. బన్నీ సాహసం చేయడం అవసరమా అంటున్నారు.

Allu Arjun: బన్నీ ఇప్పుడు ఈ సాహసం అవసరమా?
New Update

అల్లు అర్జున్‌ (Allu Arjun) ..జాతీయ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమ 68 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు. పుష్ప సినిమాతో ఈ రికార్డు క్రియేట్ చేసి పుష్ప 2 (Pushpa 2) కోసం రెడీ అయిపోతున్నాడు. పార్ట్‌ 1 తో పాన్‌ ఇండియా సూపర్‌ హిట్ అందుకున్న సుకుమార్‌..ఇప్పుడు పార్ట్‌ 2 తో మరో సారి పాన్‌ ఇండియా రికార్డులు బ్రేక్‌ చేసేందుకు రెడీ అయిపోతున్నాడు.

ఈ సినిమా గురించి ఇప్పటికే మూడు నిమిషాల వీడియోని శాంపిల్‌ గా చూపించేశాడు. దానిని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోయారు. తాజాగా బన్నీ తన నెక్ట్స్ సినిమా కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే పుష్ప 2 తరువాత త్రివిక్రమ్‌, సందీప్‌ వంగతో రెండు భారీ ప్రాజెక్టులను అనౌన్స్‌ చేశాడు.

కానీ ఈ గ్యాప్ లో మరో డైరెక్టర్‌ తో మరో సినిమా చేసే ఛాన్స్‌ ఉందని వార్తలు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. తమిళ సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌ అట్లీతో బన్నీ ఓ భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్లు సమాచారం. అట్లీ బాలీవుడ్ బాద్‌ షా షారూక్‌ ఖాన్‌ తో తీసిన జవాన్‌ ఎంత హిట్‌ అయ్యిందో తెలిసిందే.

జవాన్‌ సినిమా కేవలం బాలీవుడ్‌ వాళ్లకి మాత్రమే ఎక్కిందని..సౌత్‌ వాళ్లకి ఏ మాత్రం అర్థం కాలేదని ఇక్కడి వారి టాక్‌. కానీ బన్నీతో కొత్త కథ చేస్తే ఒకే కానీ జవాన్‌ లాంటి రోటీన్‌ సినిమా చేస్తే ఇక్కడి వరకు ఎక్కదు. పుష్ప2 తర్వాత బన్నీ నుంచి అంతకుమించి అనేలా సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడున్న బన్నీ క్రేజ్‌కు అట్లీ ప్రాజెక్ట్ అనవసరమనే చెప్పాలి.

Also read: బీచ్‌లో భర్తతో సైనా నెహ్వాల్‌ బోల్డ్‌ డ్యాన్స్‌ 😝.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వైరల్‌ వీడియో!

#allu-arjun #atlee #jawan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి