Viral Video: బీచ్‌లో భర్తతో సైనా నెహ్వాల్ బోల్డ్ డ్యాన్స్ 😝.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వైరల్ వీడియో! తన భర్త, సహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ కశ్యప్‌తో కలిసి థాయ్‌లాండ్‌లో టూర్ ఉన్న సైనా నెహ్వాల్ అక్కడి హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ సాంగ్‌కు బీచ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ డ్యాన్స్ వీడియో కింద నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. By Trinath 27 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్(Saina Nehwal) సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవలే భర్త, సహచర బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌తో కలిసి థాయ్‌లాండ్ టూర్లో ఉన్న సైనా అందాలు ఆరబోస్తోంది. ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచిన సైనా ప్రస్తుతం కుర్రకారు హాట్ టాపిక్‌గా మారింది. బ్యాడ్మింటన్ లవర్స్‌తో పాటు యూత్‌ని కట్టిపడేసే స్టిల్స్‌తో ఆకర్షిస్తోన్న సైనా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. తన భర్త కశ్యప్‌తో కలిసి బీచ్‌లో ఆడి పాడింది. డ్యాన్స్‌తో ఊపేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) బ్యాడ్మింటన్ కోర్టులో స్మాష్‌లతో అలరించే సైనా, కశ్యప్.. యువతను తమ డ్యాన్స్‌తో స్మాష్ చేశారు. ఎంతో బోల్డ్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను థ్రిల్ చేశారు. థాయ్‌లాండ్ బీచ్‌లో సరదగా గడుపుతూ చాలా ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తున్న సైనా ఈ సారి మరో వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ప్రముఖ బాలీవుడ్ ట్రాక్ 'హంగామా హో గయా'కు డ్యాన్స్ చేస్తు కనిపించారు. వరస్ట్ కాదు.. ఫన్నీ డ్యాన్సర్స్: 'Two worst dancers ever 😝😝😝😝' అని ఇన్‌స్టాలో క్యాప్షన్ పెట్టారు సైనా. అయితే వరస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటూ నెటిజన్లు సరదాగా రిప్లై ఇస్తున్నారు. మీ ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటే చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం కాస్త అతిగా రియాక్ట్ అవుతున్నారు. నువ్వు ఆడదానివేనా అంటూ ఏదో చేతికి వచ్చింది రాస్తున్నారు. అంటే అబ్బాయిలు బీచ్‌లో డ్యాన్స్ చేస్తే తప్పు కాదు అమ్మాయి చేస్తా తప్పా..? ఓకే ఇలాంటి వాళ్ల కామెంట్స్ పక్కన పెడితే చాలా మంది ఫన్నీగా ఈ జంట డ్యాన్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ మాత్రం కోఆర్డినేషన్ లేకుండా డ్యాన్స్ చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. కశ్యప్ ఒకటే స్టెప్‌ను పదేపదే వేస్తే సైనా మాత్రం బ్యాడ్మింటన్ షాట్స్‌లో వేరియేషన్ చూపించినట్టు డిఫెరెంట్ స్టెప్స్‌తో ఆకట్టుకుంది. Also Read: వారేవా ఏం ఆడావ్ బ్రో.. సెంచరీతో అదుర్స్.. టీమిండియా ఆలౌట్! WATCH: #viral-video #badminton #parupalli-kashyap #sports-news #saina-nehwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి