AP Elections : ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా అల్లు అర్జున్ ఏపీ రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం మాట్ టాపిక్ గా అయ్యాడు. ప్రచారం ఇంకొద్ది గంల్లో ముగుస్తుంది అనగా వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళీ మరీ అల్లు అర్జున మద్దతివ్వడంపై తెగ చర్చ నడుస్తోంది. By Manogna alamuru 11 May 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Allu Arjun Campaign For YCP MP Shilpa Ravi: మామూలుగానే ఎన్నికల హడావుడితో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు మరింత వేడెక్కింది. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. తన బాబాయ్ పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతోన్న పిఠాపురంలో ఎంట్రీ ఇస్తే.. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. తన స్నేహితుడి కోసం నంద్యాలలో అడుగు పెట్టారు. అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి మరీ మద్దతిచ్చారు. ప్రచారం ముగియడానికి కొద్ది గంటల ముందు బన్నీ మద్దతు ఇవ్వడంపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చేయి పట్టుకుని మరీ అల్లు అర్జున్ ఓటు వేయాలని చెప్పడం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఒకవైపు బాబాయ్‌కు మద్దతుగా రామ్‌చరణ్ పిఠాపురం వస్తే...అల్లు అర్జున్ ఇలా చేయడేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అక్కడికి వెళ్లకపోయినా పర్వాలేదు కానీ...వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం ఏంటనే చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలో పవన్‌కి, అల్లు అర్జున్‌కి మధ్య... గ్యాప్ ఉందని ఎప్పటి నుంచో టాక్ ఉంది. సరైనోడు ఫంక్షన్ నుంచి దీనిపై మరింత దుమారం రేగింది. అందులో పవన్ గురించి చెప్పాలని ఫ్యాన్స్ కోరినా...చెప్పను బ్రదర్ అంటూ అప్పట్లో అల్లు అర్జున్ కామెంట్ చేశారు. అప్పటి నుంచే అల్లు అర్జున్‌పై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా వైసీపీని ఓడించాలన్న...పవన్ పిలుపునకు వ్యతిరేకంగా శిల్పా రవికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం పవన్ ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు. పవన్‌కు ఓటు వేయాలంటూ రెండు రోజుల కిందట ట్వీట్ చేసిన అల్లు అర్జున్...ఇప్పుడు సంద్యాలకు రావడంతో పెద్ద దుమారం రేగుతోంది. అయితే శిల్పా రవి భార్య నాగిని రెడ్డి, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మేట్స్, మంచి స్నేహితులు. దీని ద్వారా అల్లు అర్జున్, నాగిని రెడ్డి భర్త శిల్పా రవి కూడా ఫ్రెండ్స్ అయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే శిల్పారవికి అల్లు అర్జున్ ట్విట్టర్ లో ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే శిల్పా రవి అభ్యర్థన మేరకే బన్నీ నంద్యాలకు వచ్చారని చెబుతున్నారు. Also Read:Telangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కూటమికే ఓటేయాలి..సీఎం రేవంత్ రెడ్డి #allu-arjun #elections #politics #andhra-paradesh #pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి