Alla Rama Krishna Reddy : ఎమ్మెల్యే ఆర్కే(MLA RK) షర్మిల(YS Sharmila) కు షాక్ ఇవ్వనున్నారా... అంటే అవుననే వినిపిస్తోంది. ఆర్కే తిరిగి మళ్ళీ వైసీపీ(YCP) లో జాయిన్ అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆయన జగన్‌ను కలవనున్నారని తెలుస్తోంది. జగన్ కూడా మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతలను ఆళ్ళకు అప్పగించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కొన్ని రోజుల క్రితమే పార్టీని వీడిన ఆళ్ళ..
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొన్ని రోజుల క్రితం వైసీపీకి నుంచి బయటకు వచ్చేశారు. ఇక మీదట షర్మిల వెంటే నా జీవితం అన్నారు. షర్మిల ను కలిసి అన్ని విషయాలను చర్చించాను అని చెబుతున్నారు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి(Alla Rama Krishna Reddy). వైసీపీకి ఎంతో సేవ చేశాను కానీ నాకు అవమానాలే మిగిలాయని ఆవేదన వ్యకంత చేశారు. ఇక మీదట నుంచి షర్మిల వెంటే నడుస్తానని తేల్చి చెప్పేశారు. ఆమె ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే మంగళగిరి నుండి పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
అన్నీ అవమానాలే అన్నారు?
తొమ్మిదిన్నర సంవత్సరాలు వైసీపీ కోసం పనిచేశా కానీ ఇకపై వైసీపీలో ఉండేది లేదని చెప్పారు. తాను ఎవరినీ నిందించడం లేదని… తన రాజీనామాను ఆమోదించకపోవడం వాళ్ళమని చెప్పారు. తాను పార్టీ వీడడానికి సమాధానం సీఎం జగనే చెప్పాలని కూడా అన్నారు ఆర్కే. తనను చాలా మంది ఇతర పార్టీల్లోకి రావాలని ఆహ్వానించారని కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. అందుకే షర్మిలతో ఉండాలనే నిర్ణయించుకున్నానని తెలిపారు. జగన్ తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదని పార్టీ వీడలేదని… పొమ్మనలేక పొగబెట్టారని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు.
సీన్ రివర్స్..
కానీ ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అయింది. వైఎస్ కుటుంబానికే నా జీవితం అంకితం..షర్మిల వేంటే నా ప్రయాణం...కాంగ్రెస్‌తో విడదీయలేని సంబంధం ఉంది అన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పుడు దాన్ని వదిలేయబోతున్నారని సమాచారం. తనను పట్టించుకోలేదని తిట్టిన వైసీపీలోకే తిరిగి వెళ్ళనున్నారని అంటున్నారు. అయితే దీనికి కారణాలు ఏంటి? ఎందుకు తిరిగి వైసీపీలోకి వెళుతున్నారు అనేది మాత్రం ఇంకా పూర్తిగా తెలియలేదు. దీని గురించి ఆళ్ళ కూడా ఎక్కడా ఇంకా ప్రకటన చేయలేదు.
Also Read : Kota: కోటాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహాం లభ్యం..