Telangana : ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌!

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సోమవారం వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

New Update
Telangana : ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌!

MLC Elections : తెలంగాణ (Telangana) లో సార్వత్రిక ఎన్నికలు (General Elections) ఈ నెల 13న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సోమవారం వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు (By-Elections) అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిలక పోలింగ్ జరగనుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోపాటు లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే ఉప ఎన్నిక జరుగుతుండడం విశేషం.

ఈ ఉప ఎన్నికలకు ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్ (Election Commission), 9 వరకు నామినేషన్లు స్వీకరించింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4 లక్షల 63వేల 839 మంది పట్టభద్రులు ఓటు హక్కు ఉపయోగించుకోనున్నారు. వారిలో 2 లక్షల 88 వేల 189 మంది పురుషులు కాగా లక్షా 75 వేల 645 మంది మహిళలున్నారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.
అధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతి తక్కువగా సిద్ధిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు

1448 మంది పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులని నియమించారు. సోమవారం మద్యం దుకాణాలు బంద్‌ సహా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ కార్యాలయాల సిబ్బంది ఓటు వేసేందుకు యాజమాన్యాలు సహకరించాలని, షిఫ్టుల సర్దుబాటు, ఆలస్యంగా వచ్చేందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. లోక్‌సభ ఫలితాలు వెల్లడైన మరుసటిరోజు అంటే జూన్ 5న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also read: ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు