Alia Bhatt Ram Mandir: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగవైభవంగా సాగింది. ఈ కార్యక్రమానకి దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా వీఐపీ హాజరయ్యారు. వీరిలో సినీరంగానిచెందిన ప్రముఖలు కూడా ఉన్నారు. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్(Sri Rama Janmabhoomi Kshetra Trust) ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రముఖులు అయోధ్య(ayodhya) వేడుకకు హాజరయ్యారు. వారిలో బాలీవుడ్ జంట అలియా భట్, రణ్ బీర్ కపూర్ (Alia Bhatt, Ranbir Kapoor)ఉన్నారు. భర్తతో కలిసి అలియా ఆలయానికి వచ్చారు. ఆలయంలో అలియా ప్రత్యేక ఆకర్షగా నిలవడమే కాదు..ఆ ధరించిన చీర కూడా చూపరులను ఆకట్టుకుంది. ఇప్పుడు అలియా ధరించిన చీర(saree) గురించే సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకంతా చర్చ అనుకుంటున్నారా? అయితే ఈస్టోరీలో తెలుసుకుందాం.
అలియా చీర కొంగుపై రామాయణం:
అయోధ్యాపురిలో రామమందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన అలియా భట్ దంపతులు ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ట అనంతరం రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాదు అలియా తన వస్త్రధారణలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలియా చీరకొంగులో రామాయణం ఇతివృతా(Ramayana theme)న్ని డిజైన్ చేశారు.దీంతో ఫొటోగ్రాఫర్లు ఆమె చీరను కెమెరాలతో క్లిక్ మనిపించారు. ఆమె ధరించిన చీర కొంగుపై రామాయణాన్ని వివరించే అంశాలు చాలా ఉన్నాయి. దీంతో ఆ చీర ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
నీలిరంగులో చీరలో మెరిసిన అలియా:
అలియా కట్టుకున్న చీర ఎంతో సింపుల్ గా ఉన్నా..ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే చీర అంచుపై కొంగుపై రామాయణాన్ని కళ్లకు కట్టే చిత్రాలు, అక్షరాలు ఉన్నాయి. రామసేతు(Ram Setu), హనుమాన్(hanuman) చిత్రాలు ఉన్నాయి. అలియా ఏ కార్యక్రమానికి వెళ్లిన తన డ్రెస్సింగ్ స్టైల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఈ క్రమంలోనే అలియా అయోధ్య పర్యటనలో కూడా చాలా శ్రద్దతో చీరను స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నారు.
అలియా కట్టుకున్న చీర ఖరీదు రూ. 45వేలు:
ఈ బ్లూ కలర్ సిల్క్ చీరను డిజైనర్ లేబుల్ మాధుర్య(Designer label Madhurya) డిజైన్ చేశారు. ఈ చీర కొంగును తయారు చేసేందుకు పది రోజుల సమయం పట్టిందని చెప్పారు. చీర కొంగులో రాముడు శివ ధనుస్సును విరగొట్టడం, రాముడు అడవికి వెళ్లడం, గంగానదిపై వంతెన, బంగారు జింక, సీతా అపహరణ వంటి చిత్రాలను రూపొందించినట్లు తెలిపారు. ఈ చీర ఖరీదు రూ. 45వేల అని పేర్కొంది.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ దీక్ష విరమింపజేసిన స్వామి గోవింద్ దేవ్ గిరిజీ మహరాజ్ ఎవరు?