School Holidays: అలర్ట్.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు..!!

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. విశాఖ, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ పేర్కొంది.

New Update
School Holidays: అలర్ట్.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు..!!

మిచౌంగ్ తుఫాన్‌ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో తమిళనాడుతోపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోస్తాతోపాటు రాయలసీమలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముంపు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈనేపథ్యంలో పలుజిల్లాల్లో పాఠశాలలకు నిన్న నేడు సెలవు కూడా ప్రకటించింది.

ఇప్పటికే విశాఖపట్నంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ తుఫాన్ తీవ్రత తగ్గకపోవడంతో ఈ రోజు కూడా సెలవు ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా, ప్రకారం జిల్లా, కృష్ణా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ పేర్కొంది. ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీఆవోకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని సూచించింది.

కాగా తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాలో అతి భారీవర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జలదిగ్భంధం అయ్యింది. నెల్లూరు, మచిలీపట్నం మధ్య తుఫాన్ తీరం దాటనున్నట్లు తెలుస్తోంది. దీంతో మత్స్య కారులు వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాదు తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు రైళ్లను కూడా రద్దు చేసింది. అందు వల్ల రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.

ఇది కూడా చదవండి:  గ్రూప్-2 పరీక్షపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు.. మరో నెల రోజుల్లోనే ఎగ్జామ్..!!

Advertisment
తాజా కథనాలు