Akshay Kumar : లోక్ సభ బరిలోకి బాలీవుడ్ హీరో.. అక్కడినుంచే పోటీ!

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీని క్లీన్‌స్వీప్‌ చేయాలనే ప్లాన్ లో భాగంగా చాందినీ చౌక్‌ నుంచి అక్షయ్ ని బీజేపీ బరిలోకి దింపబోతున్నట్లు సమాచారం. అక్షయ్ పాజిటివ్ గా స్పందించినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

New Update
Akshay Kumar : లోక్ సభ బరిలోకి బాలీవుడ్ హీరో.. అక్కడినుంచే పోటీ!

Lok Sabha : బాలీవుడ్(Bollywood) హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు పొత్తు కుదుర్చుకోగా.. బీజేపీ సైతం ఢిల్లీని క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఓ లోక్‌సభ స్థానం నుంచి అక్షయ్ కుమార్ ను బరిలోకి దించాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


చాందినీ చౌక్‌ నుంచి..
ఈ మేరకు చాందినీ చౌక్‌(Chandni Chowk) నుంచి అక్షయ్‌ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే పార్టీ నేతలు అక్షయ్‌ను ఒకసారి సంప్రదించారని, అతను కూడా పాజిటీవ్ గా స్పందించినట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఇది కూడా చదవండి:KTR:’చలో మేడిగడ్డ’.. కార్యక్రమానికి పిలుపునిచ్చిన కేటీఆర్!

ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో..
ఇదిలావుంటే.. ఢిల్లీ(Delhi) లో మొత్తం 7 లోక్‌సభ స్థానాలు ఉండగా ఆప్‌ నాలుగింట్లో, కాంగ్రెస్‌(Congress) మూడింట్లో బరిలోకి దిగనుంది. గత ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను బీజేపీ(BJP) కైవసం చేసుకుంది. దీంతో ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. అయితే ఆప్‌, కాంగ్రెస్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ బిగ్ ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగానే స్థానికతను దృష్టిలో ఉంచుకొని యాక్షన్‌ హీరో ను లోక్‌సభ బరిలోకి దింపబోతున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు