Air India: ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిర్‌ ఇండియా ఆఫర్..

దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. చాలా చోట్ల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మరో రెండు రోజుల్లో మొదటి దశ పోలింగ్ కూడా స్టార్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తొలిసారి ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Air India: ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిర్‌ ఇండియా ఆఫర్..
New Update

Air India Offer For First Time Voters: ఈసారి ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓట్ వేసే యువత చాలా మంది ఉన్నారు. గతం కంటే ఇప్పుడు ఈ ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. దీంతో తొలిసారి ఓటర్లను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ రోజున సెలవులు ఇస్తున్నారు. బస్సులు, రైళ్ళల్లో ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇది బాటలో ఎయిర్ ఇండియా కూడా పయనిస్తోంది. ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిర్ ఇండియాకూడా స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, ఇంటర్నేషనల్‌ సర్వీసుల టికెట్‌ ధరలపై తొలిసారి ఓటర్లకు 19 శాతం రాయితీ ప్రకటించింది.

ఈరూల్స్ మాత్రం తప్పనిసరి...

ఎయిర్ ఇండియా ప్రకటించిన ఈ ఆఫర్ పొందాలనుకునేవారు 18 నుంచి 22 ఏళ్ళ మధ్య వారై ఉండాలి. మొబైల్ యాప్ లేదా కంపెనీ వెబ్ సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 నుంచి మాత్రమే ప్రయాణం చేయాలి. వీటన్నింటితో పాటూ ట్రావెల్ డెస్టినేషన్ ఓటు వేయబోయే నియోజకవర్గానికి దగ్గరలో ఉండాలి. ఇవి కాకుండా ఆఫర్ పొందాలంటే ఐడీతో సహా ఓటు వేసే వివరాలు, సంబంధిత పత్రాలు అన్నీ చూపించాలి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లోని.. ఎక్స్‌ప్రెస్‌ లైట్‌, ఎక్స్‌ప్రెస్‌ వాల్యూ, ఎక్స్‌ప్రెస్‌ ఫ్లెక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బిజ్‌.. ఇలా నాలుగు కేటగిరీలకూ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

Also Read:Russia: రెండేళ్ళయినా పట్టువదలని రష్యా..ఉక్రెయిన్‌పై మళ్ళీ దాడి

#elections #poling #vote #air-india #frist-time-voters
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe