టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా విమానంలో ప్యాసింజర్‌కి ఇచ్చిన భోజనంలో బ్లేడు ముక్క కనిపించింది. ఇదిచూసి కంగుతిన్న ప్రయాణికుడు అనంతరం అధికారులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే విమానంలో ఈ సంఘటన జరిగింది. గతవారం ఎయిరిండియా ఏఐ 175 విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆ ప్యాసింజర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ఎయిరిండియా చీఫ్ కస్టమర్ ఎక్‌పీరియన్స్ అధికారి స్పందించారు. మా ఫ్లైట్‌లో జర్నీ చేసిన ఓ ప్రయాణికుడి భోజనంలో మెటల్ వస్తువు ఉన్నట్లు గుర్తించామని అన్నారు.
Also Read: భారత్‌లో ప్రకంపనలు రేపుతున్న ఈవీఎం హ్యాకింగ్..
దీనిపై విచారణ చేయగా.. కూరగాయలు కట్ చేసేందుకు వాడే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఒక ఇనుప బ్లేడ్ ముక్క వచ్చిందని తెలిసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రయాణికుడికి క్షమాపణలు చెబుతున్నామని, మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉండగా.. ఇటీవల ఓ ప్రయాణికుడు కూడా ఎయిరిండియా విమానాల్లో భోజనాలకు సంబంధించి ఫిర్యాదు చేశాడు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు సరిగా ఉడకని భోజనాన్ని ఇచ్చారని.. సీటు కూడా సరిగా లేదని ఫిర్యాదు చేశాడు.
Also Read: పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసన చేస్తూ గుండెపోటుతో బీజేపీ నేత మృతి