Rahul Gandhi : కుక్క తెచ్చిన తంట..రాహుల్‎పై కేసు నమోదు..!!

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తన తల్లి సోనియాగాంధీకి నూరి కుక్కపిల్లను బహుమతిగా అందించారు. ఇప్పుడు దాని పేరుపై కొత్త వివాదం రాజుకుంది. కుక్క పిల్లకు నూరి అని పేరు పెట్టడంతో ఏఐఎంఐఎం(AIMIM)తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. పదిరోజులు గడుస్తున్నా రాహుల్ క్షమాపణ చెప్పకపోవడంతో... ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫర్హాన్ ప్రయాగ్ రాజ్‎లోని సీజేఎం కోర్టును ఆశ్రయించారు. దీంతో రాహుల్ గాంధీపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు...నవంబర్ 8కి విచారణను వాయిదా వేసింది. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ కుక్కను తన తల్లి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Rahul Gandhi: సోనియాకి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చిన రాహుల్‌..దానిని చూసి సోనియా!
New Update

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన తల్లి సోనియాగాంధీకి నూరి కుక్కపిల్లని గిఫ్టుగా ఇవ్వడంతో దాని పేరుపై కొత్త వివాదం తలెత్తింది. రాహుల్ కుక్కపిల్లకు పేరు పెట్టే సమయంలో ..ఈ పేరు వల్ల కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదేమో. అసలు విషయం ఏంటంటే...రాహుల్ కుక్కపిల్లకు నూరీ అనే పేరు పెట్టడంపై ఓవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ -ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM)ఆగ్రహం వ్యక్తం చేసింది.

కుక్క పిల్లకు ఈ పేరు పెట్టినందుకు రాహుల్ ను కూడా హెచ్చరించింది. నూరిపేరుపై ఇప్పుడు ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫర్హాన్ ప్రయాగ్ రాజ్ లోని సీజేఎం కోర్టును ఆశ్రయించారు. రాహుల్ పై కేసు పెట్టారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు...నవంబర్ 8కి విచారణను వాయిదా వేసింది. రాహుల్ కుక్కకు నూరి పేరు పెట్టి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని కోర్టులో దాఖలైన కేసులో ఏఐఎంఐఎంనేత ఫర్హాన్ పేర్కొన్నారు. ఇదే కాదు ఇస్లాంలో నూరి అంటే మొహమ్మద్ ప్రవక్త వ్యక్తిత్వాన్నికి సంబంధించిగా పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: 40లో 25లా కనిపించాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి…!!

ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా చేసినందుకు రాహుల్ పై ఈ కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై నవంబర్ 8వ తేదీన సీజేఎం కోర్టు విచారణ చేపట్టనుంది. మహమ్మద్ ఫర్హాన్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయనుంది. రాహుల్ గాంధీకి కూడా నోటీసు జారీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ జంతు దినోత్సవమైన అక్టోబర్ 4న రాహుల్ గాంధీ తన తల్లి సోనియాగాంధీకి కుక్కపిల్లను గిఫ్టుగా ఇచ్చారు. దాని పేరు నూరి అని పెట్టారు. ఈ పేరుపై ఏఐఎంఐఎం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పది రోజులు గడిచిపోయినా రాహుల్ స్పందించలేదని..కుక్క పేరు మార్చకపోవడంతోనే రాహుల్ పై కేసు పెట్టాల్సి వచ్చిందని ఆయన తెలిపాడు.

ఇది కూడా చదవండి: ఏపీ విద్యార్థులు, ఉద్యోగులకు అలర్ట్.. దసరా సెలవులో మార్పు..వివరాలివే!

#rahul-gandhi #sonia-gandhi #aimim #dog-name
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe