కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన తల్లి సోనియాగాంధీకి నూరి కుక్కపిల్లని గిఫ్టుగా ఇవ్వడంతో దాని పేరుపై కొత్త వివాదం తలెత్తింది. రాహుల్ కుక్కపిల్లకు పేరు పెట్టే సమయంలో ..ఈ పేరు వల్ల కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదేమో. అసలు విషయం ఏంటంటే…రాహుల్ కుక్కపిల్లకు నూరీ అనే పేరు పెట్టడంపై ఓవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ -ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM)ఆగ్రహం వ్యక్తం చేసింది.
పూర్తిగా చదవండి..Rahul Gandhi : కుక్క తెచ్చిన తంట..రాహుల్‌పై కేసు నమోదు..!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తన తల్లి సోనియాగాంధీకి నూరి కుక్కపిల్లను బహుమతిగా అందించారు. ఇప్పుడు దాని పేరుపై కొత్త వివాదం రాజుకుంది. కుక్క పిల్లకు నూరి అని పేరు పెట్టడంతో ఏఐఎంఐఎం(AIMIM)తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. పదిరోజులు గడుస్తున్నా రాహుల్ క్షమాపణ చెప్పకపోవడంతో... ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫర్హాన్ ప్రయాగ్ రాజ్‌లోని సీజేఎం కోర్టును ఆశ్రయించారు. దీంతో రాహుల్ గాంధీపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు...నవంబర్ 8కి విచారణను వాయిదా వేసింది. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ కుక్కను తన తల్లి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Translate this News: