B.Tech: ఉద్యోగం చేస్తూనే బీటెక్ చదివే అవకాశం.. ఇదిగో వివరాలు

పాలిటెక్నిక్ డిప్లోమా పూర్తి చేసి.. ఏడాది పాటు ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నవారికి.. ఓవైపు జాబ్ చేస్తూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. వారాంతంలో రెండురోజులు సాయంత్రం పూట తరగతులకు హాజరై బీటెక్ కోర్సు పూర్తి చేయొచ్చు.

B.Tech: ఉద్యోగం చేస్తూనే బీటెక్ చదివే అవకాశం.. ఇదిగో వివరాలు
New Update

చాలామంది నార్మల్ డిగ్రీ, లేదా బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాతే ఉద్యోగం వెతుక్కుంటారు. అయితే ఇప్పుడు బీటెక్ చేసేవారికి చదువుతో పాటు.. ఉద్యోగం చేసే అవకాశం లభించనుంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. వారాంతంలో రెండు రోజులపాటు తరగతులకు హాజరై ఇంజినీరింగ్ పూర్తి చేయొచ్చు. అంతేకాదు మూడేళ్లలోనే బీటెక్ పట్టాను సంపాదించుకోవచ్చు. కానీ ఇందుకోసం పాలిటెక్నిక్ డిప్లోమా పూర్తి చేయాలి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) దేశవ్యాప్తంగా గత విద్యాసంవత్సరమే (2023-24) సాయంత్రం బీటెక్ కోర్సుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read: హైదరాబాద్‌ పిల్లల అక్రమ రవాణా ముఠా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

ఈసారి మరిన్ని కళాశాలలకు అనుమతి 

ఈ తరగతులు నిర్వహించేందుకు గత ఏడాది దేశంలో మొత్తం 137 ఇంజినీరింగ్ కాలేజీలకు పర్మిషన్ రాగా.. తెలంగాణలో ఓయూ ఇంజినీరింగ్ కాలేజీకి మాత్రమే ఛాన్స్ దక్కింది. రాష్ట్రంలో గతఏడాది మరో 11 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా AICTE నుంచి పర్మిషన్ వచ్చినా రాష్ట్ర సర్కార్ నుంచి అనుమతి లభించలేదు. అయితే ఈ ఏడాది ఆ కాలేజీలతో సహా.. మరికొన్నింటికి పర్మిషన్ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా బీటెక్ చదువుకుంటూ ఉద్యోగం చేసేలా గత ఏడాది ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధమైనా కూడా జీఓ జారీ కాలేదు. దీంతో మళ్లీ AICTE నుంచి రెన్యువల్‌కు దరఖాస్తు చేశామని స్టాన్లీ, మెథడిస్ట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల ఛైర్మన్‌ కృష్ణారావు తెలిపారు.

 విద్యార్థుల డిమాండ్‌

పాలిటెక్నిక్ డిప్లోమా చేసిన విద్యార్థుల్లో చాలామంది థర్డ్‌ ఇయర్ పూర్తైన వెంటనే బీటెక్‌ చదివితే వేతనం ఎక్కువగా వస్తుందన్న ఆలోచనతో లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందుతారు. ఒకవేళ ఉద్యోగంలో చేరితే మళ్లీ బీటెక్, ఎంటెక్ లాంటివి చదువుకునే అవకాశం మళ్లీ ఉండదని భావించి.. డిప్లోమా పూర్తి అయిపోయిన వెంటనే బీటెక్‌లో జాయిన్ అవుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా డిప్లొమా చదివి ఉద్యోగాలు చేస్తున్న వేలాదిమంది విద్యార్థులు తమ విద్యార్హత పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత విద్యాసంవత్సరమే (2023-2024) సాయంత్రం బీటెక్ కోర్సులు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది.

Also Read: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్

జూన్‌ 10 నాటికి కాలేజీల వివరాలు 

అయితే సాయంత్రం కోర్సుల్లో చేరాలనుకునే వారు కనీసం సంవత్సరం పాటు ఉద్యోగం చేసి ఉండాలి. వీళ్లకు డైరెక్ట్‌గా బీటెక్ రెండో ఏడాదిలో చేరే అవకాశం ఉంది. ఒక బ్రాంచికి 30 నుంచి 60 సీట్ల వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓయూలో గత ఏడాది మెకానికల్, సివిల్, ఏఐ అండ్‌ మెషిన్ లెర్నింగ్ కోర్సులు ప్రారంభించగా.. ఈసారి ఎలక్ర్టికల్ బ్రాంచికి కూడా AICTE నుంచి పర్మిషన్ వచ్చింది. ప్రస్తుతం ఒక్కో బ్రాంచికి 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. కనీసం 10 మంది విద్యార్థులు చేరితేనే సాయంత్రం తరగతులు నడపాల్సి ఉంటుంది. శని, ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తారు. జూన్ 10వ తేదీ నాటికి ఈ ఏడాది సాయంత్రం కోర్సులకు పర్మిషన్‌ పొందిన కాలేజీల సంఖ్య తెలుస్తుందని ఓ అధికారి చెప్పారు. గత ఏడాది సివిల్, మెకానికల్ బ్రాంచ్‌లకు మంచి స్పందన వచ్చిందని.. అన్ని సీట్లు కూడా ఫిల్‌ అయ్యాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఆచార్య శ్రీరాం వెంకటేశ్ చెప్పారు. ఇక త్వరలోనే నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పారు.

#telugu-news #telangana #engineering #b-tech #ou
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe