B.Tech: ఇకనుంచి ఉద్యోగం చేస్తూనే.. బీటెక్ చదవచ్చు

పాలిటెక్నిక్ (డిప్లొమా) పూర్తి చేశాక ఉద్యోగాలు చేసుకునే వారికి ఇంజినీరింగ్ చేసేందుకు AICTE రాష్ట్రంలో 12 ఇంజినీరింగ్ కళాశాలలకు ఇటీవలే పర్మిషన్ ఇచ్చింది. ఈ విద్యాసంవత్సరంలో ఈ వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ప్రవేశాలు పొందేందుకు నవంబర్ 30 వరకు అవకాశం ఉంది.

New Update
Telangana : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పు

పాలిటెక్నిక్ పూర్తి చేశాక.. కొంతమంది విద్యార్థులు కుటుంబ పరిస్థితుల వల్ల బీటెక్ చేయకుండానే ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతారు. అయితే ఇంతకుముందు ఉద్యోగం చేస్తూ ఇంజినీరింగ్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు వచ్చేశాయి. ఇంజినీరింగ్ చేయాలనే బలమైన కొరిక ఉంటే.. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టకుండా బీటెక్ చదువుకోవచ్చు. ఇలాంటి వారికి బీటెక్‌ వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ అనే పేరుతో బీటెక్‌ రెండో సంవత్సరంలో అడ్మిషన్లు ఇస్తారు. అయితే ఈ కోర్సును నిర్వహించేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం 12 ఇంజినీరింగ్‌ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ మధ్యే అనుమతినిచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు పలు కాలేజీల్లో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పించేందుకు (ఏఐసీటీఈ) పర్మిషన్ ఇచ్చింది.

అయితే ఈ విద్యాసంవత్సరంలో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ప్రవేశాలు పొందేందుకు నవంబర్ 30 వరకు అవకాశం ఉంది. కంప్యూటర్‌సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ వంటి ప్రోగ్రాముల్లో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పిస్తారు.
అయితే దీన్ని ఎలా అమలు చేస్తారంటే.. మూడేళ్ల పాలిటెక్నిక్‌ (డిప్లొమా) పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్‌ రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. అయితే ఇందుకు అడ్మిషన్లు కల్పించేందుకు ప్రవేశ పరీక్షను ఆయా కాలేజీలోనే నిర్వహిస్తారు. సాయంత్రం లేదా వారాంతాల్లో అడ్మిషన్‌ పొందిన కాలేజీల్లో తరగతులు ఉంటాయి . అలాగే కోర్సు ఫీజులను కూడా కాలేజీలే నిర్ణయిస్తాయి. ప్రస్తుతం ఓయూలో సంవత్సరానికి రూ. 1 లక్షగా ఖరారుచేశారు.

అడ్మిషన్లు కల్పించే కలాశాలలు ఇవే..

1. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌

2. చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

3. వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ

4. మాతృశ్రీ ఇంజినీరింగ్‌ కాలేజీ

5. మెథడిస్ట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ

6. స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ

7. తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ

8. జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌

9. మాటూరి వెంకటసుబ్బారావు ఇంజినీరింగ్‌ కాలేజీ

10. కాకతీయ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ – కొత్తగూడెం

11. అబ్దుల్‌ కలాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజికల్‌ సైన్సెస్‌

12. అనుబోస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

Also Read: ఈ ప్రభుత్వ బ్యాంకులో భారీ రిక్రూట్‎మెంట్..ఈ అర్హతలుంటే జాబ్ గ్యారెంటీ..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు