Mallikarjun Kharge: ఎలక్టోరల్ బాండ్లపై మల్లిఖార్జున ఖర్గే సంచలన ఆరోపణలు

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను ఈసీకి సమర్పించడంలో SBI చేస్తున్న ఆలస్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. కేంద్రం గడువు జూన్ 16తో ముగుస్తుండగా.. ఎస్బీఐ జూన్ 30 దాకా గడువు కోరడం ఏంటన్నారు.

Mallikarjun Kharge Congress: నామినేషన్ వెయ్యకుండా ఆపుతున్నారు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
New Update

Mallikarjun Kharge About Electoral Bonds: రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే ఎలక్టోరల్ బాండ్ల విషయంలో మోదీ సర్కార్ కాంగ్రెస్ జాతీయ అధ్యకక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bond) ద్వారా పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చేస్తున్న ఆలస్యానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని.. అన్నారు. నేషనల్ బ్యాంకును కేంద్రం రక్షణ కవచంలా వినియోగించుకుంటోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్న కేంద్ర నిర్ణిత కాలం జూన్ 16 తో ముగుస్తుండగా.. ఎస్బీఐ జూన్ 20 దాకా గడువు కోరడం ఏంటని ప్రశ్నలు సంధించారు.

Also Read:  ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట.. నిర్దోషి అని ప్రకటించిన బాంబే హైకోర్టు

ఎలక్టోరల్ బాండ్లను వాడుకుని ఎక్కువగా అక్రమ లావాదేవీలు చేసింది బీజేపీనేనని (BJP) ఆరోపించారు. మార్చి 6వ తేదీ నాటికి ఎన్నికల సంఘానికి బాండ్ల వివరాలివ్వాల్సిన ఎస్బీఐ (SBI) డెడ్‌లైన్‌ను జూన్ 30 దాకా పొడగించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎలక్టోరల్ బాండ్ల నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలందించిన 44 వేల 434 కంపెనీలు, వ్యక్తుల వివరాలు సిద్ధం చేసేందుకు ఎస్టీఐ బ్యాంకుకు 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదని మరోవైపు పలువురు నిపుణులు వాదిస్తున్నారు.

ఇదిలాఉండగా ఎస్బీఐ.. పార్టీల పేరు మీద విడుదల చేసే ఎలక్టోరల్ బాండ్లను కంపెనీలు, వ్యక్తులు కొనుక్కున్నట్లైతే ఆ నిధులు రాజకీయ పార్టీల (Political Parties) ఖాతాల్లోకి చేరుతాయి. ఎవరు బాండ్లు కొనుగోలు చేశారనేదాన్ని రహస్యంగా ఉంచుతారు. ఈ పథకంలో పారదర్శకత లేదని ఇటీవల దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు విచారించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని.. వాటికి సంబంధించిన వివరాలు ఎలక్షన్ కమిషన్‌కు వెంటనే అందించాలని స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం ధర్మాసనం (Supreme Court) ఆదేశించింది.

Also Read: సమయం ఇవ్వండి.. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలపై సుప్రీం కోర్టుకు  ఎస్బీఐ అభ్యర్ధన

#mallikarjun-kharge #bjp #electoral-bonds #telugu-news #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe