Watch Video : స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిన టీచర్.. ప్రిన్సిపాల్ దాడి ఉత్తప్రదేశ్‌లోని ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో ఓ టీచర్‌పై ప్రధానోపాధ్యాయురాలు చేయి చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. By B Aravind 04 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Uttar Pradesh : ఉత్తప్రదేశ్‌లోని ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు(School) ఆలస్యంగా వచ్చిందనే(Coming Late) కారణంతో ఓ టీచర్(Teacher) పై ప్రధానోపాధ్యాయురాలు చేయిచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాలోని సీగానా గ్రామంలో గుంజన్ చౌదరి అనే మహిళ.. ప్రీ సెకండరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే ఆమె స్కూల్ ఆలస్యంగా వచ్చిందనే కారణంతో ఆ పాఠశాల లేడీ ప్రిన్సిపాల్ ఆమెపై దాడికి దిగింది. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. Also Read: ప్రజ్వల్ రేవన్న ఇంటికి సిట్ అధికారులు.. రెండోసారి లుక్ఔట్ నోటీసులు ఈ గొడవలో ఆ టీచర్ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియా(Social Media) లో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఇదిలాఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లేడీ ప్రిన్సిపాల్ పాఠశాలలో ఫేషియల్ చేయించుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ఇది గమనించి ఆమె వీడియో తీసిన టీచర్ చేయి కొరికింది ఆ ప్రిన్సిపాల్. ఈ ఘటన మరవకముందే ఇలాంటిది చోటుచేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024 Also Read: భార్యతో అసహజ శృంగారం నేరం కాదు : హైకోర్టు #school #uttar-pradesh #coming-late #telugu-news #teacher మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి