సీన్ రివర్స్.. జీన్స్ వేసుకోవాలని అత్త.. చీరనే కడతానని కోడలు ఫైటింగ్..! ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్తాకోడళ్ల మధ్య విచిత్ర పంచాయితీ జరిగింది. జీన్సే ధరించాలని అత్త పట్టుబడితే.. కోడలు మాత్రం చీరనే కడుతానంటూ తెగేసి చెప్పింది. ఈ పంచాయితీ కాస్తా ముదిరి పోలీస్ స్టేషన్‌కు చేరింది. By Shiva.K 21 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Agra, 21 November: అత్తా కోడళ్ల మధ్య ఏదో ఒక అంశంపై నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భౌతిక దాడులకు దిగిన ఘటనలు కూడా ఉంటాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పంచాయితీ మాత్రం చాలా విచిత్రమైంది. మోడ్రన్ అత్తకు.. సంప్రదాయ బద్ధమైన కోడలికి మధ్య జరిగిన ఈ పంచాయితీ.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఇంతకీ ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం.. యూపీలోని ఆగ్రాకు చెందిన అత్తాకోడళ్ల మధ్య దుస్తుల విషయంలో నిత్యం గొడవ జరుగుతోంది. అత్తకు జీన్స్ అంటే ఇష్టం.. ఆమె జీన్స్ మాత్రమే ధరిస్తుంది. అంతేకాదు.. తన కోడలిని కూడా అవే డ్రెస్సులు వేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తోంది. అయితే, కోడలు మాత్రం అత్త చెప్పిన మాటను వినడం లేదు. తనకు చీర కట్టుకోవడమే చాలా ఇష్టమని, చీర మాత్రమే కట్టుకుంటానంటూ తెగేసి చెబుతోంది. తన మాటను అత్త వినడం లేదంటూ వాపోతోంది. ఇద్దరి మధ్య పంచాయితీ రోజు రోజుకు మరింత ముదరడంతో ఇక లాభం లేదనుకున్న కోడలు.. పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. తన అత్తపై ఆగ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన అత్త తనను జీన్స్ వేసుకోవాలంటూ బలవంతం చేస్తోందని, చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. 'నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. నాకు చీరలు ధరించడమంటేనే ఇష్టం. జీన్స్ వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఈ విషయంలో అత్తింట్లో వేధింపులు ఎక్కువయ్యాయి. అత్త నా మాట వినడం లేదు. భర్తకు చెబితే.. తిరిగి నన్నే కొడుతున్నాడు.' అని కోడలు తన ఫిర్యాదులో పేర్కొంది. పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు.. వారికి కౌన్సిలింగ్ ఇస్తామని చెబుతున్నారు. సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. Also Read: నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే.. ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య! #wife-and-husband #daughter-in-law #mother-in-law #family-disputes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి