ఏం చేస్తున్నార్రా మీరు అసలు..ఇంతకంటే దరిద్రం ఉంటుందా !

తాజా బ్యాంటింగ్‌ సెన్సేషన్‌ శుభ్‌మన్‌ గిల్‌, సచిన్‌ కూతురు సారా టెండూల్కర్‌ మార్ఫింగ్‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. గిల్, సారా క్లోజ్‌ గా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

New Update
ఏం చేస్తున్నార్రా మీరు అసలు..ఇంతకంటే దరిద్రం ఉంటుందా !

ఏఐ ఈ పేరు వింటుంటేనే ఒక రకమైన భయం పుట్టుకొస్తుంది. ఏఐని ఉపయోగించుకుని ముందుకు వెళ్దామని నిపుణులు ఆలోచిస్తుంటే..దానిని పనికిమాలిన వాటికి ఉపయోగించి ప్రజల్లో కంగారు పుట్టిస్తున్నారు. మార్ఫింగ్‌ చేసిన ఫోటోలు, వీడియోలు నిజంగా ఒరిజినల్ లాగే ఉంటున్నాయి.

టెక్నాలజీ తెలిసిన వారు కూడా అవి నిజమైనవా? మార్ఫింగ్‌ చిత్రాలా అనేవి తెలియడం లేదు. దీని వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందరో జీవితాలు ఆగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఫోటోలు చాలానే బయటకు వచ్చాయి. అలా బయటకు వచ్చినవి ఇంటర్నెట్‌ లో వైరల్‌ గా మారుతున్నాయి.

Also read: విజయవాడ మల్టీప్లెక్స్‌ లో పురుగులు పట్టిన సమోసాలు..సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌!

నిన్నటికి నిన్న ప్రముఖ నటి రష్మిక డీప్‌ ఫేక్‌ చిత్రాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆమెకు బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ ప్రముఖుల వరకు మద్దతుగా నిలిచారు. దీంతో కొందరు నిపుణులు వాటిని ఫేక్‌ ఫోటోలని తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా మరో సెలబ్రిటీ జంట ఫోటో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది.

వారు ఎవరో కాదు..ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ ముద్దుల కూతురు సారా టెండూల్కర్‌, ప్రస్తుత బ్యాటింగ్‌ సెన్సేషన్‌ శుభ్‌మన్‌ గిల్ మార్ఫింగ్‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ గా మారాయి. వాళ్లిద్దరూ చాలా క్లోజ్‌ గా ఉన్నట్లు ఆ చిత్రం ఉంది. స్వయనా సారానే ఆ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పెట్టిందని..దాంతో వారిద్దరి రిలేషన్‌షిప్‌ కన్ఫామ్ అయ్యిందని అందరూ అనుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

కానీ నిజానికి ఇది ఫేక్‌ పోస్ట్‌ ..అంతేకాకుండా అది మార్ఫింగ్‌ ఫోటో. నిజానికి ఒరిజనల్‌ ఫోటోలో సారా తన తమ్ముడు అర్జున్‌ టెండూల్కర్‌ తో కలిసి ఉంది. కానీ కొందరు అర్జున్‌ ఫేస్‌ ని గిల్‌ ముఖంతో మార్ఫ్‌ చేసి మరో ఫోటోను రెడీ చేశారు. దాంతో ఈ ఫోటో చూడాటానికి నిజంగానే సారా గిల్ తో కలిసి దిగినట్లే కనిపిస్తోంది.

Also read: తుమ్మల నివాసంలో సోదాలు.. ఎంత దొరికిందంటే?

దీంతో చూసినవారు..అసలు విషయం తెలుసుకున్న వారంతా కూడా..వామ్మో ఏఐతో ఇంత ప్రమాదం పొంచి ఉందా అంటూ షాకవుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలా.. లేక ప్రమాదంలో పడుతున్నామని బాధ పడాలో అర్థం కావడంలేదంటున్నారు పబ్లిక్‌.

Advertisment
Advertisment
తాజా కథనాలు