WORLD CUP 2023:వీళ్ళు మామూలోళ్ళు కాదు...ఏకంగా ఇంగ్లాండ్ నే ఓడించేశారు. వరల్డ్ కప్ టోర్నీలో సంచలనం నమోదు అయ్యింది. డిఫెండింగ్ ఛాంపియన్ ను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆఫ్ఘన్.. మూడో మ్యాచ్ లో ఏకంగా ఇంగ్లండ్ టీమ్ నే మట్టికరిపించింది. మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దంటూ ఒక హెచ్చరికను జారీ చేసింది. By Manogna alamuru 16 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి World Cup 2023 - Eng vs Afg : ఆఫ్ఘన్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగింది. ఒక పెద్ద టీమ్ ను ఓడించి మేము పిల్ల బ్యాచ్ కాదని నిరూపించుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ను ఓడించి మరీ తమ సత్తా ఏమిటో నిరూపించుకుంది. నిన్న జరిగిన ఇంగ్లాండ్ (England), ఆఫ్ఘాన్ (Afghanistan) మ్యాచ్ లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్థాన్ జట్టులో మొదట బ్యాటర్లు రాణించగా.. ఆ తర్వాత బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ ఆ జట్టును 215 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఆఫ్ఘన్ జట్టు 69 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్ (Mujeeb Ur Rahman) 3, రషీద్ ఖాన్ (Rashid Khan)3 వికెట్లు, నబీ 2 వికెట్లు పడగొట్టారు. Also Read: కోహ్లీ చేసిన ఈ పని పాకిస్థాన్ ప్రజల హృదయాలను హత్తుకుంది.. వైరల్ వీడియో..! అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఓపెనర్లు గుర్భాజ్, ఇబ్రహీం సూపర్ స్టార్టింగ్ ఇచ్చారు. గుర్భాజ్ అదిరిపోయే ఇన్నింగ్స్ తో మొదట్నుంచే ధాటిగా ఆడి ఇంగ్లండ్ బౌలర్లకు వణుకుపుట్టించాడు. అంతకుముందు ఇబ్రహీం 28 పరుగులు చేసి ఔటైయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేయడంతో అనుకున్నంత స్కోర్ చేయలేకపోయారు. అయితే మిడిలార్డర్ లో వచ్చిన ఇక్రామ్ హాఫ్ సెంచరీతో రాణించగా, చివర్లో ముజీబ్, రషీద్ ఖాన్ పర్వాలేదనిపించడంతో ఆఫ్ఘన్ 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ కు వరల్డ్ కప్ టోర్నీలో ఇదే అత్యధిక స్కోర్. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ మూడు, వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 285 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు మొదట్నుంచే దడపుట్టించారు ఆఫ్ఘన్ బౌలర్లు. బ్యాటర్లను ఏమాత్రం నిలదొక్కుకోకుండా పక్కా ప్లాన్ తో కట్టడి చేశారు. మిడిలార్డర్ లో హార్రీ బ్రూక్ మినహాయిస్తే ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. బ్రూక్ ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాటం చేసినా.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. చివరికి బ్రూక్ కూడా 66 పరుగులు చేసి ఔటవడంతో ఇంగ్లండ్ ఓటమిని కాపాడుకోవడం కష్టమైంది. ఆఫ్ఘన్ బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ 215 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ 69 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర స్రుష్టించింది. వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లండ్ ను ఓడించడం ఇదే తొలిసారి. 2015 వరల్డ్ కప్ టోర్నీతో తొలిసారి మెగా టోర్నీలో అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్థాన్ ఒక పెద్ద టీమ్ ను ఓడించడం ఇదే మొదటిసారి. Also Read: ఇద్దరూ ఇద్దరే.. రోహిత్, కోహ్లీకి ఉన్న ఈ రికార్డులు చూస్తే మతిపోవాల్సిందే..! #cricket #afghanistan #england #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి