ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్ కు గుడ్‌న్యూస్‌.. పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్ రద్దు!

ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. పోస్ట్ గ్రాడ్యూయేట్ ((ఎంఈ, ఎంటెక్‌) కోసం నిర్వహించే 6 ఎంట్రెన్స్ ఎగ్జామ్ రద్దు చేసేందుకు విద్యామండలి కసరత్తులు చేస్తోంది. 2024-25లో ప్రవేశ పరీక్ష పెట్టకుండానే విద్యార్థులకు పీజీలో ప్రవేశాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్ కు గుడ్‌న్యూస్‌.. పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్ రద్దు!

MTech : ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యూయేట్ కోసం నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్ రద్దు చేసేందుకు విద్యామండలి కసరత్తులు చేస్తోంది. అంతేకాదు ఇప్పటికే దీనిపై చర్చలు జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయగా.. 6 పోస్ట్‌ గ్రాడ్యుయే ట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్‌ టెస్ట్‌ లో కొన్ని పరీక్షలు రద్దు కానున్నాయి.

ఈ మేరకు పరీక్షల్లేకుండా ప్రవేశాలు కల్పించే విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో జేన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి, ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ, పీజీఈసెట్‌ పూర్వ కన్వీనర్‌ రవీంద్రారెడ్డి ఉన్నారు. ఈ కమిటీ పలు సిఫారసులు చేయనుండగా, వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం ఆయా ప్రతిపాదనలకు ఆమోదిస్తే జీవో జారీ అవుతుంది. పీజీ ఇంజినీరింగ్‌ (ఎంఈ, ఎంటెక్‌) కోర్సులకు ప్రవేశ పరీక్షలేకుండా ప్రవేశాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 6 పోస్ట్‌ గ్రాడ్యుయే ట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్‌ టెస్ట్‌ (పీజీఈ సెట్‌)లో కొన్ని పరీక్షలు రద్దు కా నున్నాయి. వీటిలో టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జీ వంటి కోర్సుల ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.

Also read :Telangana Government: జర్నలిస్టులకు తెలంగాణ కొత్త సర్కార్ గుడ్ న్యూస్..

ఇక పీజీఈసెట్‌ను మొత్తం 19 సబ్జెక్టులకు నిర్వహిస్తుండగా, పలు కోర్సుల్లో సీట్లు పెరగడం, ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే 2024 -25 సంవత్సరంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టకుండానే ప్రవేశాలు కల్పించేందుకు ప్రణాళికలు నడుస్తున్నాయి. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్‌ను నిర్వహిస్తున్నారు. కానీ ఈ యేడాది 27 కాలేజీల్లో 718 ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ సీట్లుంటే నలుగురు విద్యార్థులు అర్హత సాధిస్తే వారిలో ఒక్కరు కూడా చేరలేదు. టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో 18 సీట్లుంటే 8మంది పీజీఈసెట్‌లో అర్హత సాధించగా, ఒక్కరూ చేరలేదు. మెటలర్జీకి ఒక కాలేజీలో 30 సీట్లుం టే ఐదుగురే అడ్మిషన్స్‌ పొందారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో 138 సీట్లుంటే 20 సీట్లే భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈ, ఈసీఈ, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఎం ఫార్మసీ వంటి పీజీ కోర్సులకు డిమాండ్‌ తీవ్రంగా ఉండగా, వీటికి ప్రవేశ పరీక్షను నిర్వహించి, సీట్లను భర్తీచేస్తారు. పీఈసెట్‌కు రాత పరీక్ష. బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్‌ పరీక్షా విధానం మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 2004లో ఇచ్చిన జీవో 168 ప్రకారం అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈవెంట్స్‌కు బదులుగా రాత పరీక్షను నిర్వహించే అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు