Multi Starrer Movie: వావ్..! మరో క్రేజీ కాంబో.. మల్టీ స్టారర్ కు సిద్దమైన యంగ్ హీరోస్

అడవిశేష్ ప్రస్తుతం 'గూడాచారి 2', 'డెకాయిట్' సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ యంగ్ హీరో ఓ మల్టీ స్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, అడవిశేష్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.

Multi Starrer Movie: వావ్..! మరో క్రేజీ కాంబో.. మల్టీ స్టారర్ కు సిద్దమైన యంగ్ హీరోస్
New Update

Adivi Sesh - Dulquer Salmaan Multi Starrer Movie: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ట్రెండ్ బాగా నడుస్తోంది. మల్టీ స్టారర్ అనగానే ప్రేక్షకులలో కూడా తెలియని ఆసక్తి కనిపిస్తుంది. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు అభిమాన నటుల్ని చూడడానికి ఫ్యాన్స్ తెగ ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు సోలోగా ఇమేజ్ పెంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు హీరోలు. కానీ ఇప్పుడు అలా లేదు..
కథ డిమాండ్ చేస్తే మల్టీ స్టారర్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మల్టీ స్టారర్ గా వచ్చిన ఎన్నో చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. RRR, బాహుబలి, ఊపిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాదు ప్రభాస్ (Prabhas)  లేటెస్ట్ ఫిల్మ్ 'కల్కి 2898' కూడా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు స్టార్ హీరోలు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించనున్నారు.

Also Read: This Week OTT Release: ఈ వారం ఓటీటీలో సూపర్ హిట్ చిత్రాలు.. అందరూ వెయిట్ చేస్తున్న ఆ సినిమా కూడా

దుల్కర్- అడవిశేష్ మల్టీ స్టారర్

అయితే తాజాగా తెలుగులో మరో మల్టీ స్టారర్ సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ (Adivi Sesh), తమిళ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కాంబోలో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరుశురామ్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన యంగ్ డైరెక్టర్ తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబందించిన స్టోరీ చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కానీ దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Adivi Sesh - Dulquer Salmaan

ప్రస్తుతం అడవిశేష్ డెకాయిట్, గూఢచారి (Goodachari) సినిమాలు చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ షానీల్ డియో డెకాయిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన డెకాయిట్ ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read: సచిన్, ధోనీ, షారుఖ్, చెర్రి అందరూ ఒకే చోట.. అంబానీ ప్రీవెడ్డింగ్ లో తళుక్కుమన్న సెలబ్రెటీలు!

#adivi-sesh #multi-starrer #dulkar-adivi-sesh-multi-starrer #dulkar-salman
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి