Food Poison : ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుందో తెలుసా ?..

ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల వాంతులు, నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం లాంటి అనేక ఇబ్బందులు వస్తాయి. వండాల్సి పదార్థాలు, వంట సామాగ్రి, పరిసరాల అశుభ్రత వల్లే ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే తరచుగా నీళ్లు తాగుతుండాలి. నిమ్మరసం, మజ్జిగ లాంటివి తీసుకోవాలి.

New Update
Food Poison : ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుందో తెలుసా ?..

Food Poisoning : చాలామందికి కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్(Food Poisoning) అవుతుంది. దీనివల్ల వాంతులు, కడుపునొప్పి(Stomach ache), తీవ్రమైన జ్వరం(Fever) కూడా వస్తుంది. అందుకే ఆహారం తీసుకునే విషయంలో విషయంలో జాగ్రత్తలు పాటించాని చెబుతున్నారు నిపుణులు. అసలు ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫుడ్‌ పాయిజన్‌కు కారణం

వాస్తవానికి ఫుడ్ పాయిజనింగ్‌కు ప్రధాన కారణం ఆహారం కలుషితం కావడం. మనం దేన్ని వండాలనుకుంటున్నామో.. ఆ పదార్థాల్ని, వంట సామగ్రిని శుభ్రంగా కడగకపోవడం.. అలాగే వంట చేసే వ్యక్తి శుభ్రంగా లేకపోవడం, పరిసరాల అపరిశుభ్రత వల్ల ఇలా జరుగుతుంది. నాన్‌వెజ్(Non-Veg) వండిన చోటును కూడా సరిగా శుభ్రపరచకుండా.. ఒకవేళ అక్కడే కూరగాయాలు నిల్వ ఉంచినట్లైతే అవి కలుషితం అవుతాయి. దీనివల్ల ఆ పదార్థాల్లోకి చెడు బాక్టిరియా ప్రవేశిస్తుందని తద్వారా మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏ కారణం వల్ల ఫుడ్ పాయిజన్ అయినా.. వాంతులు, నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం లాంటి అనేక ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ డయేరియాకు గురైతే శరీరంలో ద్రవాల స్థాయి తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read : ఒక్క నెలలో 5 కిలోల బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!

ఫుడ్‌ పాయిజన్ రాకుండా ఉండాలంటే

ఫుడ్ పాయిజన్ రాకుండా ఉండలంటే.. తరచుగా నీళ్లు తాగుతుండాలి. నిమ్మరసం, మజ్జిగ, జీలకర్ర నీళ్లు(Jeera Water), సూప్‌లు, రాగిజావ, సగ్గుబియ్యం లాంటి ద్రవాలు తీసుకోవాలి. అంతేకాదు ముఖ్యంగా మన జీర్ణవ్యవస్థకు తగినంత విశ్రాంతి కూడా ఇవ్వాలి. ఇందుకోసం తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే అరటిపండు, మెత్తగా వండిన కిచిడి, ఉడకబెట్టిన చిలగడదుంప, పెరుగన్నం ఇలాంటివి తీసుకోవాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. మరో విషయం ఏంటంటే కారాలు, మసాలాలకు దూరంగా ఉండాలి.

పెరుగు, ఇడ్లీ లాంటి ప్రొబయాటిక్స్ తీసుకోవాలి. ఇవి మళ్లీ మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహకరిస్తాయి. అల్లం మరగబెట్టిన నీళ్లు బ్యాక్టీరియాలను తరిమేసి జీర్ణ కోశానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇక వేపుళ్లు, మైదాతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు.

Also Read : వంటగదిలో ఉండే ఇవి వాడారంటే మీ చర్మం పాడవుతుంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు