Anant Ambani Wedding: రిలయన్స్ అధినేత బిలినీయర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ జులై 12న మూడు ముళ్ళ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు హాజరయ్యేందుకు ప్రపంచ నలుమూలల నుంచి దేశాధినేతలు, సినీ తారలు, ప్రముఖులు, క్రికెటర్లు వచ్చారు.
అయితే తాజాగా ఈ వేడుక పై నటి తాప్సీ (Actress Taapsee Pannu) చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నతాప్సీని అంబానీ పెళ్లికి వెళ్లలేదా అని రిపోర్టర్ అడుగగా.. ఆమె షాకింగ్ సమాధానం ఇచ్చారు. తాను పెళ్ళికి వెళ్లకపోవడానికి కారణం వారెవరో తనకు తెలియదని చెప్పింది. పెళ్లి అనేది ఇరు కుటుంబాల మధ్య అనుబంధాలతో కూడుకున్నదని. పెళ్లి చేసేవారికి, వచ్చేవారికి ఏదో ఒక అనుబంధం ఉండాలని. కనీసం పరిచయమైన ఉండాలని. అప్పుడే ఏదైనా ఈవెంట్ కు వెళ్లాలని అనిపిస్తుందని చెప్పింది. తనకు అంబానీ ఫ్యామిలీకి వ్యక్తిగత, బిజినెస్ పరిచయాలేవి లేవని. తెలియని వారి పెళ్లికి తాను వెళ్లను అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: హైదరాబాద్లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్.. టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకోండి..?