కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటన దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు జరుగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ ఘటనపై సినీ నటి సమంత స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో పలు కీలక విషయాలు రాసుకొచ్చారు. ' మరొకసారి మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, ఆ యువతి అమూల్యమైన జీవితంపై తమ రాజకీయం చేసే మీడియా, అధికారం ఉన్నవారు.. నిందితుడికి మతిస్థిమితం లేదని చూపించాలనుకుంటున్నారు. కానీ విచారణలో ఆ నిందితుడు ఎంతటి కీచకుడో రిపోర్టులు బయటపెట్టాయి. అతడి ఫోన్‌లో కూడా పోర్నోగ్రాఫిక్ కంటెంట్ ఉన్నట్లు తేలింది.
Also Read: ‘కార్తికేయ-2’ కు నేషనల్ అవార్డు
విచారణ ముగిసిన తర్వాత నేరస్తుడు మతిభ్రమించి ఈ దారుణానికి పాల్పడలేదని స్పష్టమైంది. అతడు కూడా మనలో ఒకడే. మనలో కూడా చాలామంది అలాంటి నేరస్థులు ఉన్నారు. వాళ్లు ఎప్పటికీ ఈ లోకంలో ఉంటునే ఉంటారు. మన సామాజిక నిర్మాణంలో దీన్ని ఒక సమస్యగా పరిగణించినంత కాలం ఇలాంటి వాళ్లు తమ అధికారాలను అనుభవిస్తూనే ఉంటారు. ఇది కేవలం డాక్టర్ల భద్రత సమస్య మాత్రమే కాదు. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లకూడదని అనుకునే మహిళలందరి సమస్య. మహిళలు ఒక విధమైన డ్రెస్ వేసుకున్నా కూడా వాళ్లకి భద్రత ఉండదు. వాళ్లు ఎదిరించి మాట్లాడినా కూడా తిట్లు పడాల్సిందే. మీ పితృస్వామ్య ప్రమాణాలు మహిళలను ఏం చేయలేవు. మహిళకు గౌరవంగా బ్రతికే హక్కు ఉంది'' అంటూ సమంత తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Also Read: RTV చెప్పిందే.. సీఎం రేవంత్ చెప్పారు
ఇదిలాఉండగా.. ఇప్పటికే ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ కూడా స్పందించారు.ఈ ఘటన దురదృష్టకరమని.. ఇలాంటి దారుణానికి పాల్పడిన ఆ నిందితుడిని ఉరి తీయాలన్నారు. దోషిని ఉరి తీస్తేనే దాని నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారని వ్యాఖ్యానించారు. అలాగే ఏ ఒక్క అమాయకుడిని శిక్షించకూడదని తెలిపారు. పోలీసుల విచారణలో బయటపడ్డ అంశాలకు సంబంధించి అన్ని పత్రాలు సీబీఐకి అప్పగించామని పేర్కొన్నారు.