పెళ్లిపీటలు ఎక్కబోతున్న రంగం సినిమా హీరోయిన్‌ ..ఇది నిజమే అంటున్న నెటిజన్లు!

కార్తీక ప్రేమ లో ఉంది అంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్‌ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కార్తీక చిరునవ్వుతో ఓ వ్యక్తిని కౌగిలించుకుని వేలికి ఉంగరం ఉన్న ఫోటోని షేర్‌ చేసింది.

New Update
పెళ్లిపీటలు ఎక్కబోతున్న రంగం సినిమా హీరోయిన్‌ ..ఇది నిజమే అంటున్న నెటిజన్లు!

నాగచైతన్య జోష్‌ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన నటి రాధ పెద్ద కూతురు కార్తీక పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కార్తీక తన ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేసిన ఫోటో ఒకటి ఆ వార్తలకు ఊతమిచ్చే విధంగా ఉంది. ఎందుకంటే కార్తీక వేలికి ఉండడంతో పాటు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ముఖాన్ని చూపించకపోవడమే.

80 లలో తెలుగు సినిమా ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన హీరోయిన్‌ రాధా. అగ్ర హీరోలందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. చిరంజీవి, రాధ జంట సినిమా చేస్తున్నారంటే..అది కచ్చితంగా హిట్టే. రాధ వివాహం తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ కొంతకాలానికే ..తన వారసత్వంగా పెద్ద కూతురు కార్తీకని సినీ పరిశ్రమకి పరిచయం చేసింది.

publive-image

తొలి సినిమా ఆశించిన స్థాయిలో హిట్‌ అవ్వకపోయినా..కార్తీక మాత్రం తన నటనకు మంచి మార్కులే కొట్టేసింది. దీంతో కొద్ది కాలంలోనే తెలుగు సినిమాల్లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన నటించి మెప్పించింది. కానీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకుంటుంది.

ఈ క్రమంలోనే ఆమె గురించి చాలా కాలం కొన్ని రుమార్స్‌ షికార్‌ చేస్తున్నాయి. కార్తీక ప్రేమ లో ఉంది అంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్‌ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది.

ఆ ఫోటోలో కార్తీక చిరునవ్వుతో ఓ వ్యక్తిని కౌగిలించుకుని వేలికి ఉంగరం ఉన్న ఫోటోని షేర్‌ చేసింది. దీంతో కార్తీక నిశ్చితార్థం చేసుకుందని అతి త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా కార్తీక ఆ ఫోటోకు ఈగల్‌ ఐ ఏమోజీని కూడా పెట్టింది.

అయితే కార్తీక నిశ్చితార్ధం చేసుకున్న వ్యక్తి ఎవరు అనేది మాత్రం తెలియలేదు. కార్తీక సినిమాలకు దూరం అయినప్పటి నుంచి కూడా పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కార్తీక ప్రేమలో ఉందన్న వార్తలు కూడా ఎన్నో వచ్చాయి. కానీ అటు రాధ కానీ, కార్తీక కానీ ఈ విషయం గురించి స్పందించలేదు.

తాజాగా ఈ ఫోటో బయటకు రావడంతో మరోసారి కార్తీక పెళ్లి అంటూ వార్తలు తెర మీదకు వచ్చాయి. మొత్తానికైతే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మాత్రం కార్తీకాకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also read: ప్రముఖ నటికి షాకిచ్చిన కోర్టు..15 రోజుల్లో లొంగిపోవాల్సిందే అంటూ ఆదేశాలు!

Advertisment
తాజా కథనాలు