Priyamani: ఆయన రమ్మంటే అన్నీ వదిలేసి పోతా.. ఆ హీరోపై మోజుపడ్డ ప్రియమణి!

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తో తనకున్న అనుబంధం గురించి నటి ప్రియమణి ఓపెన్ అయింది. బాద్ షాతో పనిచేసే అవకాశం దొరికితే ఒక్క క్షణం కూడా ఆలోచించనని చెప్పింది. షారుక్ తనతో స్క్రీన్ షేర్ చేసుకోవాడానికి రమ్మంటే అన్నీ వదిలేసి వెళ్తానంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది.

New Update
Priyamani: ఆయన రమ్మంటే అన్నీ వదిలేసి పోతా.. ఆ హీరోపై మోజుపడ్డ ప్రియమణి!

Priyamani: సీనియర్ నటి ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఫ్యామిలీ మెన్​ వెబ్ సిరీస్, జవాన్, ఆర్టికల్ 370 వంటి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రియమణి.. తాజాగా 'భామాకలాపం' అనే వెబ్ సిరీస్‌ లో తనదైన నటన శైలితో అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి తన ఇష్టాలు, స్వీట్ మెమోరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ మేరకు మొదటగా ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిన నటుడు షారుఖ్ ఖాన్ అని చెప్పింది. బాద్ షాతో పనిచేసే అవకాశం దొరికితే ఒక్క క్షణం కూడా ఆలోచించనని తెలిపింది. 'షారుక్‌ నన్ను పిలిచి 'నాతో పని చేయడానికి వచ్చేయ్' అంటే వెంటనే వెళ్లిపోతా. నా చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వదిలేస్తా. ఆయనతో కలిసి పని చేయడమే నాకు అన్నింటికన్నా ఎంతో ఇష్టం' అంటూ తన మనసులో మాట బయటపెట్టింది. ఇక 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌', 'జవాన్‌' సినిమాలోనూ షారుఖ్ తో స్ర్కీన్ షేర్ చేసుకుంది ప్రియమణి. ఇక అప్ కమింగ్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీమ్యాన్‌ 3'లోనూ కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు