/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/4-1-jpg.webp)
Bollywood : బాలీవుడ్ నటి దీపికా పదుకొణె(Deepika Padukone) టాటూ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రణ్ వీర్ సింగ్ తో పెళ్లికి ముందు మరో నటుడు రణ్ బీర్ కపూర్ తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆమె తన మెడపై RK అని షార్ట్ కట్ లో పచ్చబొట్టు(Tattoo) పొడిపించుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ టాటూను తొలగించినట్లు చూపిస్తూ సోషల్ మీడియా(Social Media) లో తన బ్యాక్ పిక్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండా మరోసారి సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది.
View this post on Instagram
ప్రెగ్నెంట్ తర్వాత తొలగించింది..
ఈ మేరకు పెళ్లి తర్వాత కూడా దీపిక ఆ టాటూని చెరిపేయకపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై రకరకాలుగా మాట్లాడుకన్నారు. అయినప్పటికీ దీపిక మాత్రం ఎప్పుడూ ఎక్కడ స్పందించకపోవడం విశేషం. కాగా తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఆ టాటూ కనిపించకపోవడంతో ప్రెగ్నెంట్ అయిన తర్వాత దీపికా ఆ టాటూని తొలగించిందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు రణ్ వీర్ సింగ్(Ranveer Singh) సైతం దీనిపై ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఇన్నాళ్లకు దీపిక పచ్చబోట్లు తొలగించుకుని భర్త మర్యాదను కాపాడిందంటున్నారు. ఏది ఏమైనా పచ్చబొట్టు వ్యవహారానికి దీపిక చెక్ పెట్టేసింది. ఇదిలావుంటే.. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన 'కల్కీ 2898 ఏడీ'(Kalki 2898 AD) లో నటిస్తోంది.
ఇది కూడా చదవండి: OTT: ఈ వారం థియేటర్.. ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!
View this post on Instagram